Uttar Pradesh: అది లేదని.. ప్రియురాలి కోసం లింగ మార్పిడి చేసుకున్న యువతి, టెస్టోస్టిరాన్ రీప్లేస్మెంట్ థెరపీ చేసిన వైద్యులు, ప్రక్రియ పూర్తి కావడానికి 18నెలల సమయం
ఉత్తరప్రదేశ్‍లోని ప్రయాగ్ రాజ్‌కు చెందిన యువతి.. తన ప్రియురాలితో కలిసి బతికేందుకు లింగమార్పిడి (woman switches gender) చేయించుకుంది. లెస్బియన్లుగా ఉన్న వారి రిలేషన్‌షిప్‌కు ఇరు కుటుంబాల పెద్దలు ( girlfriend after families oppose relation) నిరాకరించారు.
Lucknow, June 27: ఉత్తరప్రదేశ్‍లోని ప్రయాగ్ రాజ్‌కు చెందిన యువతి.. తన ప్రియురాలితో కలిసి బతికేందుకు లింగమార్పిడి (woman switches gender) చేయించుకుంది. లెస్బియన్లుగా ఉన్న వారి రిలేషన్‌షిప్‌కు ఇరు కుటుంబాల పెద్దలు ( girlfriend after families oppose relation) నిరాకరించారు. ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ ఉండటంతో ఎటువంటి ఇబ్బందినైనా ఎదుర్కొనేందుకు రెడీగా అయ్యారు. ఒకరితో ఒకరిని కలవనీయకుండా కట్టడి చేయడంతో పరిష్కారం గురించి ఆలోచించారు.నచ్చజెప్పడానికి ప్రయత్నించినా.. వినకపోవడంతో ఓ యువతి లింగమార్పిడికి సిద్ధమైంది.
ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూప్ రాణి నెహ్రూ హాస్పిటల్‌లో డాక్టర్ల టీం సర్జరీ నిర్వహించారు. ఛాతీతో పాటు ఇతర శరీర భాగాలను మార్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో సర్జరీ పూర్తి కావడానికి 1.5సంవత్సరాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. ఆ మహిళకు టెస్టోస్టిరాన్ రీప్లేస్మెంట్ థెరపీ చేశారు. ఫలితంగా చాతిపై వెంట్రుకలు పెరుగుతాయని వైద్యులు వెల్లడించారు.
లింగమార్పిడి తర్వాత ఆ మహిళ గర్భం దాల్చడం వంటి అవకాశాలు కోల్పోయింది. ఇటువంటి ఆపరేషన్ జరగడం ఇదే తొలిసారి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 18నెలల సమయం పడుతుంది. ఆమెకు పూర్తి వైద్య పరీక్షలు జరిపాం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు.