LK Advani Health Update: అర్ధ‌రాత్రి క్షిణించిన‌ ఎల్ కే అద్వానీ ఆరోగ్యం, ఢిల్లీ ఎయిమ్స్ లో ప్ర‌త్యేక వైద్యుల బృందం ప‌ర్య‌వేక్ష‌ణ‌

96ఏళ్ల అద్వానీ వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. యూరాలజీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా (Advani Health Update) ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి

BJP leader Lal Krishna Advani (Photo Credit: ANI)

New Delhi, June 27: మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ (LK Advani) అనారోగ్య సమస్యతో బుధవారం ఢిల్లీలోని ఎయిమ్స్ (Delhi AIIMS) ఆసుపత్రిలో చేరారు. 96ఏళ్ల అద్వానీ వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. యూరాలజీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా (Advani Health Update) ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఎల్ కే అద్వానీ ఆరోగ్యంపై ఎలాంటి అప్‌డేట్ ఆస్పత్రి నుంచి విడుదల కాలేదు.

 

అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వర్గాల సమాచారం. అద్వానీకి ఈ ఏడాది ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రధానం చేసింది. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఎల్ కే అద్వానీని ఆయన నివాసానికి వెళ్లి భారతరత్నతో సత్కరించిన విషయం తెలిసిందే.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif