Rakesh Jhunjhunwala Dies: స్టాక్ దిగ్గజం రాకేష్ ఝన్‌ఝన్‌వాలా కన్నుమూత, రూ. 5వేలతో పెట్టుబడి ప్రారంభించి రూ. 35 వేల కోట్లకు చేరిన ఝన్‌ఝన్‌వాలా స్టాక్ ఇన్వెస్టిమెంట్లు, హైదరాబాద్‌లోనే పుట్టిన రాకేష్, స్టాక్ మార్కెట్ బిగ్‌బుల్‌గా పేరు, ప్రధాని మోదీ సంతాపం
ఆదివారం ఉదయం 6.45 గంటలకు గుండెపోటు (Heart Attack) రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ముంబైలోని బ్రీచ్ క్యాండీ దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించారని వైద్యులు నిర్ధారించారు.
Mumbai, AUG 14: ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్‌మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా (Rakesh Jhunjhunwala) కన్నుమూశారు. ఆదివారం ఉదయం 6.45 గంటలకు గుండెపోటు (Heart Attack) రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ముంబైలోని బ్రీచ్ క్యాండీ దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించారని వైద్యులు నిర్ధారించారు. హైదరాబాద్ రాజస్థానీ కుటుంబంలో జన్మించిన ఝున్‌ఝున్‌వాలా.. ఈ మధ్యే విమానయాన రంగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆయన సారథ్యంలోని ఆకాశ ఎయిర్ ఈ నెల 7న తన తొలి సర్వీసును ప్రారంభించింది. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా (Rakesh Jhunjhunwala)1960, జులై 5న రాధేశ్యామ్‌జీ, ఊర్మిళ దంపతులకు హైదరాబాద్‌లో (Hyderabad) జన్మించారు. ఆయన తల్లిదండ్రులది రాజస్థాన్. అయితే రాకేశ్ తండ్రి రాధేశ్యామ్‌జీ హైదరాబాద్‌లో ఆదాయపన్ను శాఖ అధికారిగా పనిచేశారు. దీంతో ఝున్‌ఝున్‌వాలా తన కాలేజీ రోజుల నుంచే స్టాక్‌మార్కెట్‌పై అవగాహన పెంచుకున్నారు. ముంబైలో సీఏ అభ్యసించారు.
ఇండియన్ వారెన్ బఫెట్‌గా పేరుగాంచిన ఆయన.. 1985లో స్టాక్‌మార్కెట్‌లోకి అడుగుపెట్టారు. రూ.5 వేలతో స్టాక్ ట్రేడింగ్‌లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అంచలంచలుగా ఎదిగిన ఆయన ప్రస్తుత సంపాదన రూ.35 వేల కోట్లు. ప్రస్తుతం ఆయన ఆప్‌టెక్ లిమిటెడ్, హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైనర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు చైర్మన్‌గా ఉన్నారు. పలు భారతీయ కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆయనకు భార్య రేఖ, ముగ్గురు సంతానం ఉన్నారు. రేఖ కూడా స్టాక్ ఇన్వెస్టరే కావడం విశేషం. ఝున్‌ఝున్‌వాలా మృతిపట్ల ప్రధాని మోదీ (Modi) సంతాపం తెలిపారు. పెట్టుబడుల రంగంలో చెరగని ముద్ర వేశారని అన్నారు. అనేకమంది పెట్టుబడిదారులకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి వ్యక్తం చేశారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాకేష్ మృతిపట్ల సంతాపం తెలిపారు.
రాకేష్ “బిగ్ బుల్ ఆఫ్ ఇండియా”, “కింగ్ ఆఫ్ బుల్ మార్కెట్” అని ప్రసిద్ది చెందారు. పెట్టుబడిదారు మాత్రమే కాదు.. ఆయన ఆప్‌టెక్ లిమిటెడ్, హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్‌గా ఉన్నారు. ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బిల్‌కేర్ లిమిటెడ్, ప్రజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రోవోగ్ ఇండియా లిమిటెడ్, కాంకర్డ్ బయోటెక్ లిమిటెడ్, ఇన్నోవాసింత్ టెక్నాలజీస్ లిమిటెడ్, మిడ్ డే మల్టీమీడియా లిమిటెడ్, నాగార్జున కాన్‌స్టరుక్షన్ లిమిటెడ్, విసెర్చ్‌లో వంటి అనేక సంస్థలలో డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. మాజీ జెట్ ఎయిర్‌వేస్ CEO వినయ్ దూబే కలిసి రాకేష్ ఆకాశ ఎయిర్ లైన్స్ సంస్థను స్థాపించారు. విమానయాన రంగం పరిస్థితి బాగాలేని సమయంలో ఎయిర్ లైన్స్ సంస్థను ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించినప్పుడు.. నేను వైఫల్యానికి సిద్ధంగా ఉన్నాను అంటూ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా బదిలిచ్చాడు.