SC Sentences Vijay Mallya: లిక్కర్ కింగ్ మాల్యాకు 4 నెలలు జైలు శిక్ష, రూ. 2000 జ‌రిమానా విధించిన‌ సుప్రీంకోర్టు, కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో ఈ శిక్షలు విధించిన ధర్మాసనం

2017లో కోర్టు ధిక్కారానికి పాల్పడి, పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు 4 నెల‌ల జైలు శిక్షతో (SC Sentences Vijay Mallya) పాటుగా , రూ. 2000 జ‌రిమానా విధించిన‌ట్లు సుప్రీంకోర్టు ( Four Months in Prison by Supreme Court) వెల్ల‌డించింది.

Vijay Mallya. (Photo Credits: PTI)

New Dllhi, July 11: లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యాకు సుప్రీంకోర్టు 4 నెల‌ల జైలు శిక్ష విధించింది. 2017లో కోర్టు ధిక్కారానికి పాల్పడి, పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు 4 నెల‌ల జైలు శిక్షతో (SC Sentences Vijay Mallya) పాటుగా , రూ. 2000 జ‌రిమానా విధించిన‌ట్లు సుప్రీంకోర్టు ( Four Months in Prison by Supreme Court) వెల్ల‌డించింది. 2017లో క‌ర్ణాట‌క హైకోర్టు ఆదేశాల‌ను ఉల్లంఘించి.. విదేశాల్లో ఉన్న త‌న కుమారుడు సిద్ధార్థ్ మాల్కా, కుమార్తెలు లియానా మాల్యా, తాన్యా మాల్యాల‌కు 40 మిలియ‌న్ డాల‌ర్లను ఎస్‌బీఐ బ్యాంక్ నుంచి మాల్యా బ‌దిలీ చేశారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా న‌గ‌దు బ‌దిలీ చేశార‌ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

విజయ్ మాల్యాకు 4 నెలలు జైలు శిక్ష విధించిన సుప్రీంకోర్టు, రూ. 2 వేలు జరిమానా విధించిన అత్యున్నత న్యాయస్థానం

మే 9, 2017న బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి పరారీలో ఉన్న మాల్యాపై సుప్రీంకోర్టు ధిక్కార నేరం మోపింది. డియెగో డీల్‌లోని $40 మిలియన్ల డాలర్లను తన పిల్లల విదేశీ ఖాతాలకు బదిలీ చేసినందుకు మరియు ఖచ్చితమైన ఆస్తి వివరాలను అందించడంలో విఫలమైనందుకు అతను ధిక్కార నేరానికి పాల్పడ్డాడు.కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రూ.9,000 కోట్లకు పైగా బ్యాంకు రుణాల ఎగవేత కేసులో నిందితుడుగా మాల్యా ఉన్నాడు.

అత్యున్నత న్యాయస్థానం మార్చి 10న మాల్యాపై విచారణ విషయంలో తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. బదిలీ చేసినందుకు ధిక్కార నేరానికి పాల్పడినట్లుగా 2017లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ మాల్యా చేసిన పిటిషన్‌ను 2020లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. మాల్యా మార్చి 2016 నుండి యునైటెడ్ కింగ్‌డమ్‌లో నివసిస్తున్నారు. ఏప్రిల్ 18న స్కాట్లాండ్ యార్డ్ అమలు చేసిన అప్పగింత వారెంట్‌పై బెయిల్‌పై ఉన్నారు.