Vivo Y18t: 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో విడుదలైన వివో వై18టీ, 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో అదనపు ఆకర్షణ, ధర ఎంతంటే..

వివో వై18టీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా కలిగి ఉంటుంది.రెండు రంగుల ఆప్షన్లలో లభిస్తోంది.

Vivo Y18t Launched In India With Unisoc T612 50MP Camera and 5000mAh Battery; Check Price, Specs (Photo-Vivo)

స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం వివో (Vivo) తన వివో వై18టీ (Vivo Y18t) ఫోన్ భారత్ మార్కెట్లో విడుదల చేసింది. వివో వై18టీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా కలిగి ఉంటుంది.రెండు రంగుల ఆప్షన్లలో లభిస్తోంది. ఈ ఫోన్ యూనీసోక్ టీ612 చిప్ సెట్, 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ కలిగి ఉంటుంది. 15వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.

వివో వై18టీ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,499 పలుకుతుంది. జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతం వివో ఇండియా ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయాలు జరుగుతున్నాయి. వివో వై18టీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తుంది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతోపాటు 6.56 అంగుళాల హెచ్డీ+ (720×1612 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ ప్లే కలిగి ఉంటది. 840 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ర్యామ్ వర్చువల్ గా 8 జీబీ వరకూ పొడిగించుకోవచ్చు. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో స్టోరేజీ కెపాసిటీ విస్తరించొచ్చు.

ఈ ఏడాది టెక్ లేఆఫ్‌లు ఎన్నో తెలుసా, 493 టెక్ కంపెనీలు 1,43,209 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి, పూర్తి వివరాలు ఇవిగో..

వివో వై18టీ ఫోన్ రేర్ ఫ్లాష్ తో పాటు 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 0.08 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా అమర్చారు. బ్లూటూత్ 5.2, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్, గ్లోనాస్, వై-ఫై, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. యాక్సెలరో మీటర్, అంబియెంట్ లైట్ సెన్సర్, ఈ-కంపాస్, మోటార్ గైరో స్కోప్, ప్రాగ్జిమిటీ సెన్సర్ తోపాటు సెక్యూరిటీ అండ్ బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 15వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తోంది. సింగిల్ చార్జింగ్ పూర్తయితే 62.53 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్ టైం, 6.8 గంటల పబ్జీ ప్లే బ్యాక్ టైం బ్యాటరీ ఉంటది.