Karnataka Polling: కర్ణాటకలో కొనసాగుతున్న పోలింగ్, త్రిముఖ పోరులో గెలుపుపై ఉత్కంఠ, 38 ఏళ్ల సెంటిమెంట్‌ను బద్దలు కొట్టేనా?
రాష్ట్రంలోని 224 నియోజకవర్గాలకు ఒకే విడుతలో పోలింగ్ జరుగుతుంది. 58,545 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ (Polling) ప్రక్రియ కొనసాగుతోంది. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.
Bangalore, May 10: కర్ణాటకలో శాసనసభ ఎన్నికల పోలింగ్ (Karnataka polling) ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలోని 224 నియోజకవర్గాలకు ఒకే విడుతలో పోలింగ్ జరుగుతుంది. 58,545 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ (Polling) ప్రక్రియ కొనసాగుతోంది. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఆ సమయం వరకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటేసేందుకు అవకాశం కల్పించనున్నారు. 224 నియోజకవర్గాలకు గానూ 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక 5,31,33,054 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సీఎం బొమ్మై (BJP) శింగావ్ నుంచి, మాజీ సీఎంలు సిద్ధరామయ్య(Congress) వరుణ నుంచి, శెట్టర్ (కాంగ్రెస్) హుబ్బళ్లి-ధార్వాడ సెంట్రల్ నుంచి, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (JDS) చెన్నపట్టణ నుంచి బరిలో నిలిచారు. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బందోబస్తుకు 1.56 లక్షల మంది పోలీసులను, హోంగార్డులను నియమించారు. కర్ణాటకకు చెందిన 84,119 మంది పోలీసులతో పాటు 58,500 మంది సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్సెస్‌తో పాటు ఇతర కంపెనీలో బందోబస్తులో ఉన్నాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెంచారు.