Sonu Sood: సోనూసూద్ రైలు వీడియోపై మండిపడుతున్న నెటిజన్లు, సినిమాల్లో ఒకే కాని నిజ జీవితంలో కాదు సోనూ అంటూ ముంబై రైల్వే పోలీసులు ట్వీట్, ఆ వీడియో ఇదే..

తాజాగా సోనూ సూద్‌ చేసిన ఓ పనికి నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. డిసెంబర్‌ 13వ తేదీన సోనూసూద్‌ కదులుతున్న రైల్లో ఫుట్ బోర్డుపై అజాగ్రత్తగా ప్రయాణిస్తూ కనిపిస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.

Sonu Sood (Photo-Twitter)

Mumbai, Dec 15: బాలీవుడ్‌ స్టార్‌ నటుడు, రియల్‌ హీరో సోనూసూద్‌ కరోనాలో రియల్ హీరో అనిపించుకున్న సంగతి విదితమే. తాజాగా సోనూ సూద్‌ చేసిన ఓ పనికి నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. డిసెంబర్‌ 13వ తేదీన సోనూసూద్‌ కదులుతున్న రైల్లో ఫుట్ బోర్డుపై అజాగ్రత్తగా ప్రయాణిస్తూ కనిపిస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో హ్యాండ్‌రైల్ పట్టుకుని కదులుతున్న రైలు తలుపు అంచున తన కాలి వేళ్లపై కూర్చొని.. రైలు నుంచి బయటకు చూస్తూ కనిపించారు. 20 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సోనూసూద్‌పై మండిపడుతున్నారు.

పఠాన్ మూవీ బహిష్కరించండి, ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న Boycott Pathaan హ్యాష్ ట్యాగ్, వివాదంగా మారిన బేషరమ్ రంగ్ సాంగ్

‘కదులుతున్న రైలు డోర్ నుంచి బయటకు వేలాడటం చాలా ప్రమాదకరం..’, ‘ఇలాంటి వాటిని ప్రోత్సహించడం నటుడి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం’, ‘ఇలాంటి వీడియోలు సోషల్‌మీడియాలో పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి’, ‘దేశవ్యాప్తంగా చాలా మందికి రోల్ మోడల్‌గా ఉన్న మీరు ఇలాంటి వీడియోలు పోస్టు చేయకూడదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమందైతే సోనూసూద్‌పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

Here's Video

దీనిపై ముంబై రైల్వే పోలీసులు స్పందించారు. ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణించడం సినిమాల్లో 'వినోదం'కి మూలం కావచ్చు, నిజ జీవితంలో కాదు! అన్ని భద్రతా మార్గదర్శకాలను అనుసరించండి. అందరికీ 'హ్యాపీ న్యూ ఇయర్'ని అని తెలిపారు. సోనూసూద్ ని ట్యాచ్ చేస్తూ రైల్వే పోలీసులు స్పందించారు.



సంబంధిత వార్తలు

Sonu Sood: డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారు, సీఎం ఆఫర్ మీద బాలీవుడ్‌ నటుడు సోను సూద్ కీలక వ్యాఖ్యలు

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

BRS Leader Errolla Srinivas Arrest: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్..ఖండించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఇందిరమ్మ రాజ్యమా?..పోలీస్ రాజ్యామా? అని మండిపాటు

Kamareddy: వివాహేతర సంబంధం...ముగ్గురి ప్రాణాలు తీసింది, ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ మరోకరి ఆత్మహత్య..కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురి ఆత్మహత్యలు