Wayanad Landslide Death Toll: వయనాడ్‌లో ఆగని మృత్యుఘోష, వరదలో కొట్టుకువస్తున్న మృతదేహాలు, 281కి పెరిగిన మరణించిన వారి సంఖ్య, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

ప్రస్తుతం రెస్క్యూ అపరేషన్స్ కొనసాగుతోంది. సీఎం విజయన్ ఏరియల్ సర్వే చేపట్టారు. అక్కడ సహాయక చర్యలకు వర్షం అడ్డంకులు చోటుచేసుకుంటున్నాయి

Wayanad Landslides (photo-ANI)

వయనాడ్‌ లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 281 కి చేరింది. ప్రస్తుతం రెస్క్యూ అపరేషన్స్ కొనసాగుతోంది. సీఎం విజయన్ ఏరియల్ సర్వే చేపట్టారు. అక్కడ సహాయక చర్యలకు వర్షం అడ్డంకులు చోటుచేసుకుంటున్నాయి. బురదలో కూరుకు పోయిన మృతి చెందిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వందల మంది ఆచూకి గల్లంతైంది. వయనాడ్‌లో తాత్కాలిక బ్రిడ్జి నిర్మించిన ఇండియన్ ఆర్మీ, కొనసాగుతున్న సహాయక చర్యలు..వీడియో

వరదలో మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి.ఈ ఘటనలో నిరాశ్రయులైన వారికి చరల్మల ఎగువన ముండక్కై లో వెయ్యిమందికి పైగా ఆవాసం కల్పించారు. చరల్మల నుంచి ముండక్కై వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదు. దీంతో ఆర్మీ తాత్కాలిక వంతెన నిర్మించింది. మండకై ప్రాంతంలోని టీ, కాఫీ, యాలకుల తోటల్లో పనిచేసేందుకు బెంగాల్, అసోం నుంచి వందలాది మంది కార్మికులు వచ్చారు. వీరిలో 600 మంది ఆచూకీ లభించడం లేదని అధికారులు ప్రకటించారు. వీరి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. వాయనాడ్‌లో కొనసాగుతున్న సహాయ చర్యలు, పెరుగుతున్న మృతుల సంఖ్య, బాధితులకు రాహుల్ గాంధీ పరామర్శ

కేరళలో మరో 2, 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వయనాడు జిల్లాలో భారీ వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. తాజాగా మరో 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ. కేరళ సర్కార్ 2 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. నిన్న తిరువనంతపురంలో అసెంబ్లీలో జాతీయ జెండాను సగం వరకు ఎగరేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు వయనాడ్ మృతులకు సంతాపం తెలిపారు.