RKS Bhadauria Warns China: చైనాకు చావు దెబ్బ తప్పదు, దూకుడుగా వెళ్లే అదే స్థాయిలో బదులిస్తాం, హెచ్చరికలు జారీ చేసిన ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్ష‌ల్ ఆర్‌కేఎస్ బ‌దౌరియా

చైనా (China)దూకుడుగా ప్రవర్తిస్తే తాము అంతే దూకుడుగా సమాధానమిస్తామని ఇండియన్ ఏయిర్‌ఫోర్స్ చీఫ్ (Indian Air Force) ఆర్కేఎస్ బధూరియా స్పష్టం చేశారు.

File image of RKS Bhadauria | (Photo Credits: indianairforce.nic.in)

New Delhi, Jan 24: అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో చైనా ఓ గ్రామాన్నే నిర్మించింద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్ష‌ల్ ఆర్‌కేఎస్ బ‌దౌరియా (RKS Bhadauria Warns China) ఆ దేశానికి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. చైనా (China)దూకుడుగా ప్రవర్తిస్తే తాము అంతే దూకుడుగా సమాధానమిస్తామని ఇండియన్ ఏయిర్‌ఫోర్స్ చీఫ్ (Indian Air Force) ఆర్కేఎస్ బధూరియా స్పష్టం చేశారు. జోధ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. చైనాను ఎదుర్కోవ‌డానికి తాము పూర్తి స‌న్న‌ద్ధంగా ఉన్నామ‌ని తేల్చి చెప్పారు.

తూర్పు సరిహ‌ద్దులో ఇస్తున్న శిక్ష‌ణ‌పై స్పందిస్తూ.. ఇది ద్వైపాక్షిక క‌స‌ర‌త్తుల్లో భాగ‌మ‌ని, వీటి వ‌ల్ల ఏ దేశానికి ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌ద‌ని బ‌దౌరియా తెలిపారు. అరుణాచ‌ల్‌లో చైనా క‌ట్ట‌డాల‌పై ఇంత‌కుముందే విదేశాంగ శాఖ కూడా స్పందించింది. చైనా నిర్మాణాలు చేప‌ట్టింద‌న్న వార్త‌లు తాము కూడా చూశామ‌ని, గ‌తంలోనూ చైనా ఇలాంటి నిర్మాణాలు చేప‌ట్టింద‌ని తెలిపింది. ఇండియా కూడా స‌రిహ‌ద్దు వెంబ‌డి సాయుధ బ‌ల‌గాల కోసం మౌలిక స‌దుపాయాల‌ను మెరుగుప‌రుస్తోంద‌ని చెప్పింది.

డెసెర్ట్ నైట్-21 తో సహా తూర్పు సరిహద్దుల్లో నిర్వహిస్తున్న సైనిక శిక్షణ ఏ దేశానికీ వ్యతిరేకం కాదని, ప్రతి యేటా జరిగేవే అని ఆయన పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు, సైనికుల్లో సామర్థ్యాన్ని పెంచేందుకే ఈ శిక్షణ అని, అంతే తప్ప ఏదో జరిగిపోతోందన్న అర్థం మాత్రం కాదన్నారు. భారత భూభాగంలో చైనా నిర్మాణాలపై స్పందిస్తూ... భారత ప్రభుత్వం కూడా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తోందని, సరిహద్దును, స్థానిక గ్రామాలను కలుపుతూ అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

జూలై 17వతేదీ వరకు లాక్‌డౌన్ పొడిగింపు, కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్ ప్రభుత్వం, సందర్శకులు 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ

తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంట నెలకొన్న సరిహద్దు వివాదంపై భారత్‌ - చైనా మధ్య ఆదివారం చుషూల్‌ ప్రాంతంలో మాల్డోలో తొమ్మిదో రౌండ్‌ కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి చర్చలు ఆదివారం జరుగనున్నాయి. ఇందు కోసం ఇప్పటికే విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి (తూర్పు ఆసియా), డీజీఎంఓ అధికారులు శనివారమే లడఖ్‌కు చేరుకున్నారు. ఇంతకు ముందు ఎనిమిది రౌండ్ల పాటు కార్ప్స్ కమాండర్‌ స్థాయి చర్చలు జరిగినా బలగాల ఉప సంహరణపై వెనక్కి తగ్గకపోవడంతో ప్రతిష్ఠంభన నెలకొంది. గతేడాది జూన్‌లో గాల్వాన్‌లో లోయలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ చెలరేగగా.. భారత్‌కు చెందిన 21 మంది సైనికులు ప్రాణాలను కోల్పోయారు. అప్పటి నుంచి తూర్పు లడఖ్‌లో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకుంది. ఇరుదేశాలు భారీగా బలగాలను మోహరించాయి.

సరిహద్దు వివాదం పరిష్కారం కోసం కమాండర్‌ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరుగుతాయని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ శుక్రవారం ప్రకటించారు. ఇరుదేశాలు దౌత్య, మిలటరీ మార్గాల ద్వారా రెండు దేశాలూ నిత్యం మాట్లాడుకుంటున్నాయని తెలిపారు. ఇరుదేశాల విదేశాంగ మంత్రుల మధ్య గత ఏడాది సెప్టెంబర్‌ 10న మాస్కోలో కుదిరిన ఐదు సూత్రాల ఒప్పందం అమలుపైనే ప్రధానంగా చర్చలు జరగనున్నాయి.

అయితే ఎల్‌ఏసీలో సైన్యాన్ని వెనక్కి తీసుకొని వెళ్లే తొలి బాధ్యత చైనాదేనని భారత్‌ స్పష్టం చేసింది. ఆదివారం జరిగే చర్చల్లో లెఫ్టినెంట్‌ జనరల్‌ పీజీకే మీనన్‌ (జీఓసీ 14 కార్ప్స్‌), ఐజీ నార్త్‌ ఫ్రాంటియర్‌ ఐజీ దీపం సేథ్‌, ఐటీబీపీ బ్రిగ్‌ రాజీవ్‌ ఘాయ్‌ (ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌, ఢిల్లీ) మేజర్‌ జనరల్‌ సంజయ్‌ మిత్రా (జీఓసీ 39), మేజర్‌ జనరల్‌ ఆర్‌ఎస్‌ రామన్‌, బ్రిగేడియర్‌ హెచ్‌ఎస్‌ గిల్‌ తదితరులు పాల్గొనన్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif