Black Fever: బెంగాల్‌ను పీడిస్తున్న మరో మహమ్మారి, 11 జిల్లాల్లో బ్లాక్ ఫీవర్ కేసులు నమోదు, చికిత్స లేని జబ్బుతో పోరాడుతున్న 65 మంది, బ్లాక్ ఫీవర్ కేసులు గుర్తిస్తే వెంటనే సమాచారమివ్వాలన్న బెంగాల్, ఈగల కాటుతో వ్యాపించే బ్లాక్ ఫీవర్ చాలా డేంజర్

పశ్చిమబెంగాల్ ప్రజలు బ్లాక్ ఫీవర్ తో జనాలు హడలిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాలలో 65 బ్లాక్ ఫీవర్ (Kala-Azar) కేసులు నమోదు అయ్యాయి. కేవలం రెండు వారాల్లోనే 65 కేసులు నమోదు కావటంతో బ్లాక్ ఫీవర్ పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది.

Dengue warning signs (Photo Credits: Pixabay)

Kolkata, July 17: ఒకపక్క కరోనా భయం నుంచి ప్రజలు ఇంకా బయటపడక ముందే మరో మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే మంకీ పాక్స్ కేసులు వెలుగు చూడగా...తాజాగా బెంగాల్‌ లో బ్లాక్ ఫీవర్ (Black Fever) కలకలం సృష్టిస్తోంది. పశ్చిమబెంగాల్ ప్రజలు బ్లాక్ ఫీవర్ తో జనాలు హడలిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాలలో 65 బ్లాక్ ఫీవర్ (Kala-Azar) కేసులు నమోదు అయ్యాయి. కేవలం రెండు వారాల్లోనే 65 కేసులు నమోదు కావటంతో బ్లాక్ ఫీవర్ పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రధానంగా డార్జిలింగ్, మాల్డా, ఉత్తర్ దినాజ్ పూర్, దక్షిణ్ దినాజ్ పూర్, కలింపోంగ్ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయని ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. ‘‘వాస్తవానికి కాలా అజార్ ను పశ్చిమబెంగాల్(West bengal) లో నిర్మూలించేశాము. కానీ.. ఇటీవల నిఘా పెట్టడంతో 11 జిల్లాల్లో 65 కేసులు నమోదు కావటంతో దీన్ని మరోసారి నిర్మూలించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బీర్భూమ్, బంకురా, పురూలియా, ముర్షిదాబాద్ జిల్లాల్లో బ్లాక్ ఫీవర్ కేసులు నమోదు అయ్యాయని ఇది ప్రధానంగా పరాన్నజీవి లీష్మానియా డోనోవానీ సోకిన సాండ్ ఈగలు (sandflies)కాటు ద్వారా వ్యాపిస్తుందని కానీ కోల్ కతాలో ఇప్పటి వరకు ఇటువంటి కేసులు ఏవీ నమోదు కాలేదని తెలిపారు.

ఎక్కువ రోజుల పాటు బీహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లో ఉండి వచ్చిన వారిలోనే ఈ జ్వరం బయటపడుతోంది. అదే సమయంలో బంగ్లాదేశ్ కు చెందిన కొందరు వ్యక్తుల్లోనూ ఈ లక్షణాలు ఉన్నాయి’’ అని ఓ అధికారి తెలిపారు. బ్లాక్ ఫీవర్ ఫియర్ పరిణామాలతో బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలా అజార్ తో ఎవరు ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినా తాము పూర్తిగా భరిస్తామని రాష్ట్ర యంత్రాంగం స్పష్టం చేసింది.

Human Sacrifice to Goddes: కొడుకు పుట్టాడని దేవతకు యువకుడ్ని బలి ఇచ్చిన వ్యక్తి, వరుసగా ముగ్గురు ఆడపిల్లలు, నాలుగో సంతానంగా కొడుకుపుట్టడంతో ఆనందంతో మొక్కు తీర్చుకున్నాడు, మధ్యప్రదేశ్‌లో ఘోరం 

“ప్రైవేట్ లేబొరేటరీ లేదా ఆసుపత్రిలో ఈ ఫీవర్ కు సంబంధించిన ఇన్ఫెక్షన్ గుర్తిస్తే వెంటనే జిల్లా ఆరోగ్య అధికారి దృష్టికి తీసుకురావాలని సూచించారు. బాధితులకు భోజనంతో పాటు అన్ని చికిత్స ఖర్చులు రాష్ట్ర ఆరోగ్య శాఖ భరిస్తుందని స్పష్టంచేశారు. రోగులకు పౌష్టికాహారం అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

Air Compressor Pipe Into Rectum: మీ సరదా తగలెయ్యా? ఆడుకుంటూ పురీషనాళంలో ఎయిర్ కంప్రెసర్ పెట్టిన బాలుడు, అక్కడికక్కడే మృతి చెందిన బాలుడు, గుజరాత్‌లో ఘటన, సరదాకోసం చేశానంటున్న నిందితుడు 

బ్లాక్ పీవర్ ఎక్కువగా చిన్నారుల్లోనే వస్తుంది. ఈ జ్వరం వస్తే చిన్నారులు సడెన్ గా బరువు తగ్గిపోతారు. దాంతో పాటూ నీరసపడిపోతారు. దీనిక సరైన చికిత్స ఇప్పటివరకు లేదు. కరోనా మాదిరిగానే లక్షణాలకు చికిత్స చేయడమే మినహా వ్యాక్సిన్ కానీ, ట్రీట్ మెంట్ కానీ ప్రత్యేకంగా లేదు. అయితే బ్లాక్ ఫీవర్ దక్షిణ భారత్ లో లేకపోయినప్పటికీ....ఈగల వల్ల వ్యాపించే ఈ వ్యాధి క్రమంగా విస్తరించే అవకాశాలు లేకపోలేదు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif