What is UCC Bill? యూసీసీ బిల్లు అంటే ఏమిటి? యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుతో ఎవరికి నష్టం, ఎవరికి లాభం, Uniform Civil Code బిల్లు పూర్తి సమాచారం ఇదిగో..

యూసీసీ బిల్లుకు (UCC Bill Uttarakhand) ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి సమక్షంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలంతా స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు.

Uniform Civil Code Bill UCC (Photo/ANI/File)

New Delhi, Feb 7: స్వాతంత్య్రానంతరం దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. యూసీసీ బిల్లుకు (UCC Bill Uttarakhand) ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఒకసారి గవర్నర్‌ ఆమోదం పొందితే అది చట్టంగా మారనుంది.  ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి సమక్షంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలంతా స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు.

భవిష్యత్‌లో ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం ఈతరహా బిల్లులను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ బిల్లును తాము కూడా తీసుకొస్తామని రాజస్థాన్‌  ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇక పోర్చుగీస్ పాల‌న‌లో ఉన్న‌ప్ప‌టి నుంచి గోవాలో ఉమ్మ‌డి పౌర‌స్మృతి అమ‌ల్లో ఉంది.

ఈ నేపథ్యంలో యూసీసీ బిల్లు అంటే ఏమిటనే (What is UCC Bill) దానిపై చర్చ మొదలైంది. మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే తరహా వివాహ, విడాకుల, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు వర్తించే ఈ బిల్లు గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో యూసీసీ బిల్లుకు సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తున్నాం ఓ సారి తెలుసుకోండి.

యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం, యూసీసీ బిల్లును అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచిన ఉత్తరాఖండ్

యూనిఫాం సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ 2024 బిల్లు ప్రకారం.. సహజీవనం చేసే జంటలకు ఈ బిల్లు (Uttarakhand Uniform Civil Code Bill) ద్వారా చుక్కలు కనిపించనున్నాయి. వారు చేస్తున్న సహజీవనంకు సంబంధించిన సమాచారాన్ని అధికారుల వద్ద రిజిస్టర్‌ చేసుకోవాలని బిల్లులో స్పష్టం చేశారు.

సహజీవనం (Live in Relationship) వల్ల పుట్టిన పిల్లలు చట్టబద్ధమైన వారసులుగా ఉంటారని, భాగస్వామి నుంచి విడిపోయిన మహిళకు భరణం పొందే హక్కు ఉంటుందని యూసీసీ బిల్లులో తెలిపారు. బహుభార్యత్వాన్ని నిషేధిస్తున్న ఈ బిల్లు.. ఆయా మతాలవారిని తమ ఆచారాల ప్రకారం వివాహాలు చేసుకొనేందుకు అనుమతించింది.

యూనిఫాం సివిల్ కోడ్ అంటే ఏమిటి?

మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం, వారసత్వంతో సహా వ్యక్తిగత విషయాలను నియంత్రించే చట్టాల సమితిగా యూనిఫాం సివిల్ కోడ్ భావన చేయబడింది. మతపరమైన అనుబంధాల ఆధారంగా మారుతూ ఉన్న విభిన్న వ్యక్తిగత చట్టాలను భర్తీ చేయడం UCC లక్ష్యం.

యూనిఫాం సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ 2024 బిల్లు అంటే ఏమిటి?

2022లో UCC కోసం ముసాయిదాను సిద్ధం చేసేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, సామాజిక కార్యకర్త మను గౌర్, ఉత్తరాఖండ్ మాజీ చీఫ్ సెక్రటరీ శతృఘ్నసింగ్, వైస్  డూన్ యూనివర్శిటీ ఛాన్సలర్, సురేఖ దంగ్వాల్ 740 పేజీల ముసాయిదా నివేదికను తయారు చేశారు. ఇందులో నాలుగు సంపుటాలు ఉన్నాయి.

సహజీవనం చేస్తున్న వారికి చుక్కలే, జైలు శిక్షతో పాటు భారీ జరిమానా, ఉత్తరాఖండ్‌ యూసీసీ బిల్లు గురించి తెలుసుకోండి

నివేదికను సిద్ధం చేయడానికి, ప్యానెల్ లక్షల అభిప్రాయాలను వ్రాతపూర్వకంగా, ఆన్‌లైన్‌లో సేకరించింది, అనేక పబ్లిక్ ఫోరమ్‌లు, 43 పబ్లిక్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లను నిర్వహించింది, 60,000 మంది వ్యక్తులతో ప్రత్యక్షంగా కలిసి అభిప్రాయాలు తీసుకుంది. UCC ఉత్తరాఖండ్ 2024 బిల్లు బహుభార్యత్వం, బాల్య వివాహాలపై పూర్తి నిషేధం వంటి సిఫార్సులను కలిగి ఉంది.

సహజీవనం చేయాలకును జంటలకు ఈ బిల్లు (Uttarakhand Uniform Civil Code Bill) ద్వారా  కష్టమే. వారు చేస్తున్న సహజీవనంకు సంబంధించిన సమాచారాన్ని అధికారుల వద్ద రిజిస్టర్‌ చేసుకోవాలని బిల్లులో స్పష్టం చేశారు. సహజీవనం వల్ల పుట్టిన పిల్లలు చట్టబద్ధమైన వారసులుగా ఉంటారని, భాగస్వామి నుంచి విడిపోయిన మహిళకు భరణం పొందే హక్కు ఉంటుందని యూసీసీ బిల్లులో తెలిపారు. బహుభార్యత్వాన్ని నిషేధిస్తున్న ఈ బిల్లు.. ఆయా మతాలవారిని తమ ఆచారాల ప్రకారం వివాహాలు చేసుకొనేందుకు అనుమతించింది.

ఈ చట్టాన్ని అతిక్రమించే వారికి ఆరు నెలల జైలు, రూ.25వేల వరకు జరిమానా విధిస్తామని బిల్లులో స్పష్టం చేశారు. ఇక 21 ఏండ్లలోపున్న వ్యక్తులు సహజీవనం చేయాలనుకుంటే ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపే వెసులుబాటును రిజిస్ట్రార్‌కు కల్పించారు. బిల్లు ప్రకారం తమ పేర్లను నమోదు చేసుకోకుండా నెల రోజులకుపైగా సహజీవనంలో ఉంటే వారికి మూడు నెలల జైలు లేదా రూ.10వేల జరిమానా లేదా ఈ రెండు శిక్షలూ విధిస్తారు.

సహజీవనం విషయాన్ని దాచినా లేదా తప్పుడు సమాచారమిచ్చిన వారికి కూడా మూడు నెలల జైలు, రూ.25 వేల జరిమానా లేదా ఈ రెండు శిక్షలూ విధిస్తారు. సహజీవనంలో విడిపోవాలన్నా రిజిస్ట్రార్‌కు తెలపాలి. అయితే ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఈ బిల్లు నుంచి గిరిజనులకు మినహాయింపునిచ్చింది.

బిల్లు ఆమోదం పొందిన అనంతరం సీఎం పుష్కర్‌సింగ్ ధామీ మీడియాతో మాట్లాడారు. ఉత్తరాఖండ్‌ చరిత్రలో ఇదో మరిచిపోలేని రోజని చెప్పారు. యూసీసీ అమలుకు దేశవ్యాప్తంగా ఎప్పటినుంచో డిమాండ్లు ఉన్నాయని, అలాంటి ఈ బిల్లును తొలుత ఉత్తరాఖండ్‌ తీసుకొచ్చిందన్నారు. దీనికి సహకరించిన ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ బిల్లు ఏ ఒక్కరికీ వ్యతిరేకంగా తీసుకొచ్చింది కాదన్నారు. దీనివల్ల ముఖ్యంగా మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. వివాహం, విడాకులు వంటి విషయాల్లో మహిళలపై ఉన్న వివక్షను ఈ బిల్లు తొలగిస్తుందని పేర్కొన్నారు.