ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిఫాం సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ 2024 బిల్లును సభలో ఆమోదించారు. అసెంబ్లీలో UCC బిల్లును ఆమోదించిన తర్వాత, ఉత్తరాఖండ్ దేశంలోనే యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా అవతరించింది.ఈ బిల్లును (UCC Bill on Live in Relationship) పౌరులందరికీ వారి మతాలతో సంబంధం లేకుండా.. వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వం అంశాలలో ఒకే చట్టాన్ని వర్తింపజేసేలా రూపొందించారు.

సహజీవనం చేసే జంటలకు ఈ బిల్లు (Uttarakhand Uniform Civil Code Bill) ద్వారా చుక్కలు కనిపించనున్నాయి. వారు చేస్తున్న సహజీవనంకు సంబంధించిన సమాచారాన్ని అధికారుల వద్ద రిజిస్టర్‌ చేసుకోవాలని బిల్లులో స్పష్టం చేశారు. సహజీవనం వల్ల పుట్టిన పిల్లలు చట్టబద్ధమైన వారసులుగా ఉంటారని, భాగస్వామి నుంచి విడిపోయిన మహిళకు భరణం పొందే హక్కు ఉంటుందని యూసీసీ బిల్లులో తెలిపారు. బహుభార్యత్వాన్ని నిషేధిస్తున్న ఈ బిల్లు.. ఆయా మతాలవారిని తమ ఆచారాల ప్రకారం వివాహాలు చేసుకొనేందుకు అనుమతించింది.  సహజీవనం చేస్తున్న వారికి చుక్కలే, జైలు శిక్షతో పాటు భారీ జరిమానా, ఉత్తరాఖండ్‌ యూసీసీ బిల్లు గురించి తెలుసుకోండి

Here's ANI News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)