Uttarakhand Uniform Civil Code Bill: ఉత్తరాఖండ్‌లో దేశంలో మొట్టమొదటి సారిగా సరికొత్త బిల్లు ఉమ్మడి పౌర స్మృతి బిల్లు (UCC)ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ ప్రవేశపెట్టిన ఈ బిల్లును (UCC Bill on Live in Relationship) పౌరులందరికీ వారి మతాలతో సంబంధం లేకుండా.. వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వం అంశాలలో ఒకే చట్టాన్ని వర్తింపజేసేలా రూపొందించారు.
ఇక సహజీవనం చేసే జంటలకు ఈ బిల్లు (Uttarakhand Uniform Civil Code Bill) ద్వారా చుక్కలు కనిపించనున్నాయి. వారు చేస్తున్న సహజీవనంకు సంబంధించిన సమాచారాన్ని అధికారుల వద్ద రిజిస్టర్ చేసుకోవాలని బిల్లులో స్పష్టం చేశారు. సహజీవనం వల్ల పుట్టిన పిల్లలు చట్టబద్ధమైన వారసులుగా ఉంటారని, భాగస్వామి నుంచి విడిపోయిన మహిళకు భరణం పొందే హక్కు ఉంటుందని యూసీసీ బిల్లులో తెలిపారు. బహుభార్యత్వాన్ని నిషేధిస్తున్న ఈ బిల్లు.. ఆయా మతాలవారిని తమ ఆచారాల ప్రకారం వివాహాలు చేసుకొనేందుకు అనుమతించింది.
ఈ చట్టాన్ని అతిక్రమించే వారికి ఆరు నెలల జైలు, రూ.25వేల వరకు జరిమానా విధిస్తామని బిల్లులో స్పష్టం చేశారు. ఇక 21 ఏండ్లలోపున్న వ్యక్తులు సహజీవనం చేయాలనుకుంటే ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపే వెసులుబాటును రిజిస్ట్రార్‌కు కల్పించారు. బిల్లు ప్రకారం తమ పేర్లను నమోదు చేసుకోకుండా నెల రోజులకుపైగా సహజీవనంలో ఉంటే వారికి మూడు నెలల జైలు లేదా రూ.10వేల జరిమానా లేదా ఈ రెండు శిక్షలూ విధిస్తారు.
అమ్మాయిలు లైంగిక కోరికలు అణుచుకోవాలనే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం
సహజీవనం విషయాన్ని దాచినా లేదా తప్పుడు సమాచారమిచ్చిన వారికి కూడా మూడు నెలల జైలు, రూ.25 వేల జరిమానా లేదా ఈ రెండు శిక్షలూ విధిస్తారు. సహజీవనంలో విడిపోవాలన్నా రిజిస్ట్రార్‌కు తెలపాలి. ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందాల్సి ఉంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ బిల్లు నుంచి గిరిజనులకు మినహాయింపునిచ్చింది.