New Delhi, Feb 7: ఏడేళ్ల చిన్నారి (బాధితురాలు)పై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసిన ఘటనలో సుప్రీంకోర్టు 30 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానాను (SC Verdict on Rape Case) విధించింది.ఏడేళ్ల వయసున్న బాధితురాలిని పిటిషనర్ రాజారాం బాబా ఠాకూర్ గుడికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పిటిషనర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
కిడ్నాప్, రేప్ చేసినందుకు నిందితుడి/పిటిషనర్‌పై బాధితురాలి అమ్మమ్మ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఢిల్లీ ట్రయల్ కోర్టు అతనికి ఇండియన్ పీనల్ కోడ్, 1860 (IPC) సెక్షన్ 376 AB (పన్నెండేళ్లలోపు మహిళపై అత్యాచారం) కింద మరణశిక్ష విధించింది. అయితే ఢిల్లీ హైకోర్టు దానిని జీవిత ఖైదుగా మార్చింది. దీంతో ఆగ్రహించిన పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో నేరం అనాగరికం, క్రూరమైందని కాదని హైకోర్టు నమోదు చేసిందని పిటిషన్ వాదించారు. దోషికి నేరచరిత్ర లేనందున 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు కనీస జరిమానా మాత్రమే విధించాలని పిటిషనర్ వాదనలు వినిపించాడు.దీనికి సుప్రీంకోర్టు స్పందిస్తూ ఈ విషయంలో కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు (SC Verdict in Rape Case) పేర్కొంది.
అమ్మాయిలు లైంగిక కోరికలు అణుచుకోవాలనే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం
పవిత్రమైన స్థలమని పట్టించుకోకుండా నిందితుడు అనాగరిక చర్యకు పాల్పడ్డాడని.. ఈ చర్య బాధితురాలిని జీవితాంతం వెంటాడుతుందని పేర్కొంది. దోషి శిక్షా కాలం పూర్తయ్యే వరకు జైలు నుంచి విడుదల చేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.నిందితుడికి విధించిన రూ.లక్ష జరిమానా బాధితురాలికి ఇవ్వనున్నట్లు పేర్కొంది.