WhatsApp Bans Over 80 Lakh Indian Accounts: భారత్‌లో 80 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సాప్, అది ఒక్క ఆగస్టు నెలలోనే..

ఒక్క ఆగస్టులోనే సుమారు 80 లక్షల ఖాతాలను బ్యాన్‌ చేసింది. తమ ప్రైవసీ పాలసీని ఉల్లంఘించినందుకు గానూ ఈ చర్యలు చేపట్టినట్లు వాట్సప్‌ తెలిపింది.

whatsapp

మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ భారత్ లో భారీ సంఖ్యలో ఖాతాలపై  నిషేధం విధించింది. ఒక్క ఆగస్టులోనే సుమారు 80 లక్షల ఖాతాలను బ్యాన్‌ చేసింది. తమ ప్రైవసీ పాలసీని ఉల్లంఘించినందుకు గానూ ఈ చర్యలు చేపట్టినట్లు వాట్సప్‌ తెలిపింది. ఐటీ యాక్ట్‌, 2021 నిబంధనలను అనుసరించి ఆగస్టు నెలలో భారీ సంఖ్యలో ఖాతాలపై నిషేధం విధించినట్లు వాట్సప్‌ తెలిపింది. మొత్తం 84.58 లక్షల ఖాతాలపై చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.

జియో నుంచి మరో రెండు కొత్త ఫీచర్ ఫోన్లు, జియో భారత్‌ వీ3, వీ4 మొబైల్స్‌ ధర ఎంతంటే..

ఇందులో సుమారు 16.61 లక్షల ఖాతాలను ముందు జాగ్రత్త చర్యగా బ్యాన్‌ చేశామని తెలిపింది. మోసానికి ఆస్కారం ఉండే బల్క్‌ మెసేజ్‌లు లేదా అసాధారణ మెసేజ్‌లను వాట్సప్‌ తన ఆటోమేటెడ్‌ సిస్టమ్‌ ద్వారా ముందుగానే గుర్తించి ఈ చర్యలు చేపట్టింది. అలాగే, ఆగస్టు నెలలో గ్రీవెన్స్‌ మెకానిజం ద్వారా యూజర్ల నుంచి 10,707 ఫిర్యాదులు అందినట్లు వాట్సప్‌ వెల్లడించింది. కాగా అనుచిత ప్రవర్తన, వేధింపులు వంటి విషయాల్లో యూజర్ల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత ఖాతాలను వాట్సప్‌ బ్యాన్‌ చేస్తుంటుంది.



సంబంధిత వార్తలు

Railway Shock To Reel Creators: రీల్స్ క్రియేట‌ర్ల‌కు రైల్వే శాఖ బిగ్ షాక్! ఇక‌పై ట్రైన్లు, రైల్వే ట్రాక్స్, స్టేష‌న్ల‌లో రీల్స్ చేస్తే నేరుగా ఎఫ్ఐఆర్ న‌మోదు

Happy Children's Day Wishes In Telugu: పిల్లలకు బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా... అయితే చక్కటి హ్యాపీ చిల్డ్రన్స్ డే విషెస్ మీకోసం..

CM Revanth Reddy: రైజింగ్ తెలంగాణ మా నినాదం, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను విస్మరిస్తున్న ప్రధాని, దేశ వ్యాప్తంగా ఓబీసీ కుల గణన జరగాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్

Pushpa 2 New Record: పుష్ప-2 ఖాతాలో మరో రికార్డు, అమెరికాలో ప్రీ సేల్స్‌ బుకింగ్స్ ఓపెన్‌ చేయగానే 15 వేల టికెట్లు హాట్ సేల్, ఇంత వేగంగా బుకింగ్స్‌ జరగడం ఇదే తొలిసారి