Nitish Kumar Reddy: సలామ్.. నితీశ్ కుమార్ రెడ్డి, ఆసీస్ గడ్డపై అదరహో..తెలుగు తేజానికి జేజేలు పడుతున్న క్రికెట్ ప్రపంచం..అసలు ఎవరి నితీశ్‌ రెడ్డి తెలుసా?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో సెంచరీ చేసి అదరహో అనిపించాడు తెలుగు తేజం నితీశ్ రెడ్డి. ఓ దశలో భారత్‌కు ఫాలో ఆన్ తప్పదా అని భావిస్తున్న తరుణంలో ఎనమిదో నెంబర్ ఆటగాడిగా వచ్చిన నితిన్...కంగారు బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.

Who Is Nitish Kumar Reddy... Here are the details

Hyd, December 28:  బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో సెంచరీ చేసి అదరహో అనిపించాడు తెలుగు తేజం నితీశ్ రెడ్డి. ఓ దశలో భారత్‌కు ఫాలో ఆన్ తప్పదా అని భావిస్తున్న తరుణంలో ఎనమిదో నెంబర్ ఆటగాడిగా వచ్చిన నితిన్...కంగారు బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఆసీస్ పేస్‌ను ఎదుర్కొని తన కెరీర్‌లో తొలి సెంచరీ సాధించడమే కాదు ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఓ పేరును లిఖించాడు నితీశ్. తొలి సెంచరీనే జీవితాంతం గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకంగా మలుచుకున్నాడు.

ఇక ఈ సెంచరీతో ఆసీస్ గడ్డపై తక్కువ వయస్సులోనే సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు నితీశ్. సచిన్ , పంత్ తర్వాత నితీశ్ మూడో స్థానంలో ఉన్నారు. వాస్తవానికి నితీశ్‌ను ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేసినప్పుడు, అనుభవం లేని ఈ ఆటగాడు జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారనే విమర్శలు వచ్చాయి.

అయితే ఈ సిరీస్‌లో నిలకడగా ఆడుతూ వస్తున్న నితీశ్‌ ఎక్కడా తన మనోధైర్యాన్ని కొల్పోలేదు. తన తండ్రి కలను నిజం చేస్తూ మెల్‌బోర్న్‌లో శతకాన్ని బాధి తన తానేంటో నిరూపించాడు. నితీశ్ రెడ్డి స్వస్థలం విశాఖపట్నం. 2003 మే 26న జన్మించాడు. చిన్న వయసులోనే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. తండ్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ సెంచరీ బాధి తాను ఫ్లవర్ కాదు వైల్డ్ ఫైర్ అని నిరూపించాడు. నితీశ్ సెంచరీ చేసిన సమయంలో స్టేడియంలోని ఒకాయన మాత్రం ఏడుస్తూ కనిపించాడు. అయితే సరిగ్గా చూస్తే ఆ వ్యక్తి ఆనంద భాష్పాలతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన మరెవరో కాదు నితీష్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి. ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నా నితీశ్ రెడ్డి.

నితీశ్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ నజరానా ప్రకటించింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నినితీశ్ రెడ్డికి రూ.25 లక్షల నగదు ప్రోత్సాహం ప్రకటించారు. మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీ కొట్టిన నితీష్ కుమార్ రెడ్డిని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అభినందించారు. టెస్టు క్రికెట్‌లో నితీశ్‌ కుమార్ రెడ్డి తొలి సెంచరీ, మెల్ బోర్న్ టెస్టులో అరుదైన ఫీట్ సాధించిన నితీశ్...బీసీసీఐ ప్రశంసలు 

నితీశ్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్‌లో సెంచరీ సాధించడం చాలా గర్వంగా ఉందిదని ఏసీఏ కోచ్ కుమారస్వామి అన్నారు. అండర్-14 నుంచి అండర్-19 వరకు నితీశ్ ఏసీఏలో నా దగ్గర కోచింగ్ తీసుకున్నాడని...కష్టతరమైన టెస్టులో సెంచరీ సాధించడం మా ఏసీఏకి గర్వకారణం అన్నారు. నితీశ్ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాడని...మా స్టూడెంట్‌కి ఏసీఏ తరపున అభినందనలు తెలుపుతున్నా అన్నాడు.

నితీశ్‌ ఒక్క సెంచ‌రీతో 5 రికార్డులు నెలకొల్పాడు. . బోర్డర్ గ‌వాస్కర్ ట్రోఫీలో ఇప్ప‌టి వ‌ర‌కు నితీష్ 8 సిక్స‌ర్లు బాదాడు. ఈ క్ర‌మంలో ఆస్ట్రేలియాలో ఓ టెస్టు సిరీస్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన తొలి భార‌త ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. టెస్టుల్లో నంబ‌ర్ 8 లేదా ఆ త‌రువాతి స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన శ‌త‌కం బాదిన అతిపిన్న వ‌య‌స్కుడైన మూడో ప్లేయ‌ర్‌గా నితీష్‌కుమార్ రెడ్డి ఘ‌న‌త సాధించాడు. ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై టెస్టుల్లో అతి పిన్న వ‌య‌సులో సెంచ‌రీ చేసిన మూడో భార‌త ఆట‌గాడిగా నితీష్ రెడ్డి రికార్డుల‌కు ఎక్కాడు.

ACA coach Kumaraswamy Praises Nitish Kumar Reddy

అలాగే నంబరు 8 లేదా ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్​కు వచ్చి ఆసీస్ గడ్డపై సెంచరీ చేసిన ఐదో బ్యాటర్​గానూ నితీష్‌ నిలిచాడు. ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై నంబరు 8 లేదా ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోరు నమోదు చేసిన భారత క్రికెటర్​గానూ నితీష్ రెడ్డి రికార్డుల‌కు ఎక్కాడు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now