ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్‌ రెడ్డి అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తొలి టెస్టు మూడో రోజు సెంచరీతో రాణించాడు. 171 బంతుల్లో సెంచరీ చేసిన నితీష్...తొలి శతకాన్ని నమోదుచేశాడు.

ఎనమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ భారత్‌ను ఫాలో ఆన్ గండం నుండి గట్టెక్కించాడు. మూడో రోజు ఆటముగిసే సమయానికి భారత్ 9 వికెట్లు కొల్పోయి 358 పరుగులు చేసింది. నితీశ్‌ 105 పరుగులు, సిరాజ్ రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి సెంచరీ చేసిన నితీష్ పై బీసీసీఐ ప్రశంసలు గుప్పించింది. నితీష్ అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అంటూ ట్వీట్ చేసింది. నితీశ్ స్వస్థలం ఏపీలోని విశాఖ పట్నం అన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ పై మ్యాచ్ లో చెల‌రేగిన ఆట‌గాడు, అరంగేట్రంలోనే అద‌ర‌గొట్టి స‌రికొత్త రికార్డు సృష్టించిన సౌతాఫ్రికా క్రికెట‌ర్

Nithish Reddy maiden Test 100 at MCG

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)