అక్టోబర్ 23వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌కు చెందిన టికెట్లు అన్నీ అమ్ముడుపోయినట్లు ఐసీసీ తెలిపింది. అదనపు స్టాండింగ్ రూమ్ టికెట్లు కూడా క్షణాల్లో సేల్ అయినట్లు ఐసీసీ వెల్లడించింది. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ కోసం ఇప్పటికే 5 లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. వయసుతోటి, బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధం లేకుండా అభిమానులందరికీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్‌కు స్వాగతం పలుకుతున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు 82 దేశాలకు చెందిన అభిమానులు వరల్డ్‌కప్ మ్యాచ్‌లను వీక్షించేందుకు టికెట్లు కొన్నట్లు ఐసీసీ చెప్పింది.
India vs Pakistan Tickets for ICC T20 World Cup 2022 Encounter at MCG Sold Out#INDvPAK #MCG #T20WorldCup @BCCI @TheRealPCB @T20WorldCup https://t.co/WgTnEOrTit
— LatestLY (@latestly) September 15, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)