Anand Mahindra Funny Story: బిల్‌గేట్స్ నా క్లాస్‌మేట్ అన్నందుకు నా పిల్లలు నన్ను లూజర్ అంటున్నారు, అందుకే ఆయనంటే నాకు పగ అంటున్న ఆనంద్ మహీంద్రా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇద్దరి క్లాస్ మేట్స్ ఫన్నీ కథ

అలాగే మహీంద్ర అండ్ మహీంద్రా ఛైర్మెన్ ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) గురించి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. వీరిద్దరూ క్లాస్ మేట్స్ కూడా. 1973లో హర్వర్డ్ యూనివర్శిటీలో కలిసి చదువుకున్నారు. ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకంటారా...బిల్ గేట్స్(Bill Gates) నా క్లాస్ మేట్ అన్నందుకు ఆనంద్ మహీంద్రా పిల్లలు ఆయన లూజర్ అన్నారట.. దీంతో బిల్ గేట్స్ మీద ఆయన చాలా కోపం పెంచుకున్నారట..అయితే ఇది కోపంతో కాదు లేండి. సరదాగా జరిగిన సన్నివేశం.

Anand Mahindra Funny Story (Photo-Anand Mahindra Twitter)

Mumbai, December 25: ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ గురించి తెలియని వారు ఎవరూ ఉండురు. అలాగే మహీంద్ర అండ్ మహీంద్రా ఛైర్మెన్ ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) గురించి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. వీరిద్దరూ క్లాస్ మేట్స్ కూడా. 1973లో హర్వర్డ్ యూనివర్శిటీలో కలిసి చదువుకున్నారు. ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకంటారా...బిల్ గేట్స్(Bill Gates) నా క్లాస్ మేట్ అన్నందుకు ఆనంద్ మహీంద్రా పిల్లలు ఆయన లూజర్ అన్నారట.. దీంతో బిల్ గేట్స్ మీద ఆయన చాలా కోపం పెంచుకున్నారట..అయితే ఇది కోపంతో కాదు లేండి. సరదాగా జరిగిన సన్నివేశం.

ఫన్నీ స్టోరీలోకెళితే సోషల్ మీడియా ట్విట్టర్ లో(Twitter) ఓ వ్యక్తి ఆనంద్ మహీంద్రా, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఉన్న ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని షేర్ చేశాడు. ఈ ఫోటోకి ఆనంద్ మహీంద్రాని ట్యాగ్ చేస్తూ ఇది ఎప్పుడు జరిగిందో చెప్పాలంటూ అడిగాడు.

ఈ ఫోటోని ఇన్ సైడ్ బిల్స్ బ్రెయిన్: డీకోడింగ్ బిల్ గేట్స్' (Inside Bill's Brain Decoding Bill Gates)అనే నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ(Netflix documentary) నుంచి తీసుకున్నానని ఈ ఫోటో కథ గురించి చెప్పాలని ట్విట్టర్ యూజర్ అడిగిన ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా సరదాగా సమాధానమిచ్చాడు.

anand mahindra Tweet

ఈ ఫొటోను చూసిన ఆనంద్ మహీంద్రా తన పాత జ్ఞాపకాల్లోకి వెళ్లారు. ఈ మధ్యాహ్నం ట్విట్టర్ ద్వారా మహీంద్రా స్పందిస్తూ... ఈ ఫొటోను 1997లో బిల్ గేట్స్ తొలిసారి భారత పర్యటనకు వచ్చిన సందర్భంలో తీశారని తెలిపాడు. ఆ సమయంలో సెల్ ఫోన్ కెమెరాలు లేకపోవడంతో దానికి సంబంధించిన ఫొటో తన వద్ద లేకపోయిందని తెలిపారు. ఈ ఫొటోను షేర్ చేసిన వ్యక్తికి ధన్యవాదాలు తెలిపారు.

anand mahindra Tweet

విండోస్ ఎన్టీ 4.0 వర్షన్ ను అప్పట్లో వాడిన తొలి కంపెనీల్లో మహీంద్రా అండ్ మహీంద్రా ఒకటని ఈ నేపథ్యంలో, తమతో సమావేశం కావాలని మైక్రోసాఫ్ట్ కోరిందని ఆనంద్ మహీంద్రా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. మీటింగ్ హాల్ లోకి బిల్ గేట్స్ అడుగుపెట్టిన వెంటనే మనిద్దరం ఒకే సమయంలో హార్వర్డ్ లో ఉన్నామని అనుకుంటా అని అన్నారని మహీంద్రా తెలిపారు.

anand mahindra Funny Story

దీనికి సమాధానంగా... 'ఔను. కానీ మనిద్దరం ఎప్పుడూ కలుసుకోలేదు. మీ మీద నాకు పగ ఉంది' అని చెప్పానని మహీంద్రా చెప్పారు. ఎందుకు పగ? అని బిల్‌గేట్స్ నన్ను ప్రశ్నించారని... దీనికి సమాధానంగా, 'మీ కాలేజ్ క్లాస్‌మేట్స్‌లో అందరిలో ఎవరు ఎక్కువ ఫేమస్ అని నా కూతురు నన్ను ప్రశ్నించింది. దానికి సమాధానంగా మీ పేరు చెప్పాను. దీంతో, 'మీరు లూజర్ డ్యాడ్' (What a loser you are Dad)అని నా కూతురు ఆటపట్టించింది.

anand mahindra Funny Story

మీకు చాలా థ్యాంక్స్. మీ వల్ల నా పిల్లల ముందు నేను లూజర్ గా నిలిచానని చెప్పానని... దాంతో మీటింగ్ హాల్లో నవ్వులు విరబూశాయని ఆనాటి మధుర స్మృతులను ఆనంద్ మహీంద్రా పంచుకున్నారు. ఆనంద్ మహీంద్రా చెప్పిన ఈ ఫన్నీ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజెన్లు దీనిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.