IND Win By 10 Wickets: చిత‌క్కొట్టిన య‌శస్వీ జైశ్వాల్, జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ, టీ-20 సిరీస్ భార‌త్ కైవ‌సం

బౌల‌ర్ మారినా బంతి వెళ్లాల్సిందే బౌండ‌రీయే అన్న‌ట్టు చితక్కొట్టారు. దాంతో, మ‌రో నాలుగు ఓవ‌ర్లు ఉండ‌గానే టీమిండియా జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది.

India Defeats Zimbabwe

New Delhi, July 13: పొట్టి ప్ర‌పంచ క‌ప్ విజేత టీమిండియా (IND Win By 10 Wickets) రెండు వారాల వ్య‌వ‌ధిలోనే మ‌రో సిరీస్ ప‌ట్టేసింది. జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో మ‌రో మ్యాచ్ ఉండ‌గానే యువ భార‌త్ టీ20 ట్రోఫీ కైవ‌సం చేసుకుంది. శ‌నివారం జ‌రిగిన‌ నాలుగో టీ20లో ఓపెనర్లు య‌శ‌స్వీ జైస్వాల్(93 నాటౌట్), శుభ్‌మ‌న్ గిల్(58 నాటౌట్)లు ఆతిథ్య జ‌ట్టు బౌల‌ర్లకు చుక్క‌లు చూపించారు. తొలి ఓవ‌ర్ నుంచే బౌండ‌రీల‌తో విర‌చుకుప‌డ్డ ఈ జంట రికార్డు భాగ‌స్వామ్యంతో టీమిండియాను గెలుపు బాట ప‌ట్టించింది. దాంతో, 10 వికెట్ల‌తో గెలిచిన గిల్ సేన 3-1తో సిరీస్ ద‌క్కించుకుంది. టీమిండియా కుర్రాళ్లు పొట్టి సిరీస్‌లో (IND Vs ZIM) త‌మ ప్ర‌తాపం చూపించారు. ఆతిథ్య‌ జింబాబ్వే నిర్దేశించిన 153 ప‌రుగుల ఛేద‌న‌లో ఓపెన‌ర్లు య‌శ‌స్వీ జైస్వాల్(93 నాటౌట్)(Yashasvi Jaiswal), శుభ్‌మ‌న్ గిల్(58 నాటౌట్)లు (Shubman Gill) బౌల‌ర్ల‌పై నిర్దాక్షిణ్యంగా విర‌చుకుప‌డ్డారు. బౌల‌ర్ మారినా బంతి వెళ్లాల్సిందే బౌండ‌రీయే అన్న‌ట్టు చితక్కొట్టారు. దాంతో, మ‌రో నాలుగు ఓవ‌ర్లు ఉండ‌గానే టీమిండియా జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది.

 

తొలి ఓవర్‌లోనే య‌శ‌స్వీ 15 ప‌రుగులు పిండుకొని త‌న ఉద్దేశం చాట‌గా.. గిల్ సైతం దూకుడుగా ఆడాడు. దాంతో, స్కోర్ బోర్డు ప‌రుగులు పెట్ట‌గా.. జింబాబ్వే ఫీల్డ‌ర్లు బౌండ‌రీ లైన్‌కు ప‌రుగులు పెట్టారు. 29 బంతుల్లోనే య‌శ‌స్వీ అర్ధ సెంచరీ సాధించాడు. కెప్టెన్ గిల్ కూడా మెరుపు ఫిఫ్టీతో జింబాబ్వే ఆటగాళ్ల‌ను అస‌హ‌నానికి గురి చేశాడు. ముజ‌ర‌బ‌నీ వేసిన 16వ ఓవ‌ర్ రెండో బంతికి య‌శ‌స్వీ బౌండ‌రీ కొట్ట‌డంతో10 వికెట్ల విజ‌యం న‌మోదు చేసింది.

సొంత‌గ‌డ్డ‌పై పొట్టి సిరీస్‌లో వెన‌క‌బ‌డిన జింబాబ్వే నాలుగో టీ20లో పోరాడ‌గ‌లిగే స్కోర్ చేసింది. గ‌త‌ రెండు మ్యాచుల్లో భార‌త బౌల‌ర్ల ధాటికి చేతులెత్తేసిన బ్యాటర్లు ప‌ట్టుద‌ల‌గా ఆడారు. ఓపెన‌ర్లు త‌డివ‌న‌షె మ‌రుమ‌ని(32), వెస్లీ మ‌ధెవెరె(25)లు శుభారంభ‌మివ్వ‌గా.. సికింద‌ర్ ర‌జా(0) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి స్కోర్ బోర్డును న‌డిపించాడు. అయితే భార‌త బౌల‌ర్లు వ‌ర‌స విరామాల్లో వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టును క‌ట్ట‌డి చేశారు. చివ‌ర్లో డియాన్ యెర్స్‌(13), క‌ల్ఐవ్ మ‌డండే(7)లు పోరాడ‌డంతో జింబాబ్వే నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 152 ర‌న్స్ కొట్టింది. భార‌త బౌల‌ర్ల‌లో ఖ‌లీల్ అహ్మ‌ద్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. దాంతో, ఆతిథ్య జట్టు నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 152 ర‌న్స్ కొట్టింది.



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Tech Layoffs 2024: ఈ ఏడాది భారీగా టెక్ లేఆప్స్, 1,50,034 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన 539 కంపెనీలు, ఏఐ టెక్నాలజీ రావడంతో రోడ్డున పడుతున్న ఉద్యోగులు