YES Bank Collapse: రాణా కపూర్ ఇంట్లో ఐటీ సోదాలు, దేశం విడిచిపోకుండా లుక్‌ ఔట్‌ నోటీసు జారీ, డీహెచ్ఎఫ్ఎల్‌కు భారీ ఎత్తున నిధులు తరలించారని ఆరోపణలు

మనీలాండరింగ్‌ ఆరోపణలపై విచారణలో భాగంగా ముంబై వర్లిలోని ఆయన (YES Bank founder Rana Kapoor) ఇంట్లో శుక్రవారం రాత్రి సోదాలు నిర్వహించింది. అనంతరం ఆయనపై లుక్‌ ఔట్‌ నోటీసు జారీ చేసింది. రాణాకపూర్‌ దేశం విడిచిపోవడాన్ని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈడీ అధికారి ఒకరు చెప్పారు.

YES Bank founder Rana Kapoor (Photo-Twitter)

New Delhi, Mar 07: యస్ బ్యాంకుకు ఆర్‌బిఐ మారటోరియం విధించిన కొద్ది గంటల్లోనే యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ నివాసంలో ఈడీ (Enforcement Directorate) సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్‌ ఆరోపణలపై విచారణలో భాగంగా ముంబై వర్లిలోని ఆయన (YES Bank founder Rana Kapoor) ఇంట్లో శుక్రవారం రాత్రి సోదాలు నిర్వహించింది. అనంతరం ఆయనపై లుక్‌ ఔట్‌ నోటీసు జారీ చేసింది. రాణా కపూర్‌ దేశం విడిచిపోవడాన్ని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈడీ అధికారి ఒకరు చెప్పారు.

యస్ బ్యాంకులో 49 శాతం వాటాల కొనుగులుకు ఎస్‌బిఐ బోర్టు ఆమోదం

కాగా 2015లో 80 నకిలీ సంస్థలకు రూ. 12,733 కోట్లు నిధులను మళ్లించినట్టు ఆరోపణలు వెలువెత్తాయి. అలాగే దివాలా కంపెనీ డీహెచ్ఎఫ్ఎల్ (DHFL) (దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్) కు భారీ ఎత్తున నిధులను మళ్లించబడినట్టుగా గుర్తించామని ఈడీ అధికారులు తెలిపారు. ఈ రుణాలు అన్నీ నిరర్థక ఆస్తులుగా మారాయి.

దీనికి బదులుగా భారీ ఎత్తున నగదు రాణా కపూర్‌ భార్య ఖాతాలో జమ అయ్యాయి. ఈ రుణాల స్వభావాన్ని, వాటి మంజూరులో చోటు చేసుకున్న అవకతవకలపై విచారిస్తున్నట్టు చెప్పారు. ఇందులో కపూర్ పాత్ర ఉందనే అనుమానాలు ఈడీ వ్యక్తం చేసింది. కాగా ప్రస్తుతం యస్ బ్యాంకు ఈ స్థితికి రావడానికి దారితీసిన పరిస్థితుల్లో కపూర్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

యస్ బ్యాంక్ రీకన్‌స్ట్రక్షన్ స్కీమ్, మారటోరియం విధించిన 24 గంటల తర్వాత ప్లాన్

యస్‌ బ్యాంకు సంక్షోభంపై (YES Bank Collapse) ఆర్‌బీఐ (RBI) రంగంలోకి దిగిన అనంతరం ఈడీ విచారణను వేగంతం చేసింది. మరోవైపు యస్‌బ్యాంకును (YES Bank) స్వాధీనంలోకి చేసుకున్న ఆర్‌బీఐ 30 రోజులపాటు మారటోరియం విధించింది. బ్యాంకు బోర్డును రద్దు చేసింది. అలాగే పునర్మిర్మాణ ప్రణాళికలను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 49 శాతం వాటాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది.

యస్ బ్యాంక్ సంక్షోభంపై ఆందోళన వద్దు, కస్టమర్ల సొమ్ము ఎక్కడికీ పోదు

కాగా యస్ బ్యాంకులో అవతకవకలు గుర్తించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపిన విషయం విదితమే. 2017 నుంచి యస్ బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశీలిస్తోందని తెలిపారు. పాలనపరమైన సమస్యలను గుర్తించడమే కాకుండా బలహీనతలను చూసిందని తెలిపారు. తప్పుడు ఆస్తుల వర్గీకరణనూ గుర్తించిందని వెల్లడించారు. బ్యాంకులో యాజమన్యాన్ని మార్చాలని ఆర్‌బిఐ భావిస్తోందని ఆర్థికమంత్రి తెలిపారు. ఇలాంటి సమయంలో సోదాలు జరగడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

కాగా యస్ బ్యాంకులో అవతకవకలు గుర్తించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపిన విషయం విదితమే. 2017 నుంచి యస్ బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశీలిస్తోందని తెలిపారు. పాలనపరమైన సమస్యలను గుర్తించడమే కాకుండా బలహీనతలను చూసిందని తెలిపారు. తప్పుడు ఆస్తుల వర్గీకరణనూ గుర్తించిందని వెల్లడించారు. బ్యాంకులో యాజమన్యాన్ని మార్చాలని ఆర్‌బిఐ భావిస్తోందని ఆర్థికమంత్రి తెలిపారు. ఇలాంటి సమయంలో సోదాలు జరగడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ పరిస్థితులు ఇలా ఉంటే యస్ బ్యాంక్ సంక్షోభంపై ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు, మాజీ ఎండీ రాణా కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యస్ బ్యాంకుపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మారటోరియం విధించడానికి దారి తీసిన పరిస్థితుల గురించి తనకు అసలు తెలియదని అన్నారు. గడచిన 13 నెలల నుంచి బ్యాంకుతో ఏ విధంగానూ తనకు సంబంధం లేదని, అందువల్ల నాకు ఎలాంటి అవగాహన లేదు అని ఆయన అన్నారు.

ఒకప్పుడు యస్ బ్యాంక్ డ్రైవింగ్ ఫోర్స్ గా వ్యవహరించిన రాణా కపూర్...యస్ బ్యాంకులో తన చివరి స్టేక్‌ను 2019 నవంబర్ లో అమ్మేశారు. అదే సమయంలో ప్రమోటర్లు యస్ కేపిటల్, మోర్గాన్ క్రెడిట్స్ కూడా తమ తమ వాటాలను అమ్మేశాయి. ఆయన, ఆయన గ్రూప్ సంస్థలు అంతకుముందు యస్ బ్యాంక్‌లోని రూ.510 కోట్ల విలువైన 2.16 శాతం వాటాలను బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా అమ్మేశాయి. అదే నెలలో అమ్మేసిన 1.8 శాతం వాటాలకు ఇది అదనం.రాణా కపూర్ యస్ బ్యాంక్‌ను రూ.3.4 లక్షల కోట్ల బుక్ వాల్యూకు ఒక దశాబ్దంలోనే అభివృద్ధి చేశారు. అయితే బ్యాంకు రుణాలు విపరీతంగా పెరగడంతో నిరర్థక ఆస్తులు పెరిగిపోయాయి. దీంతో బ్యాంకు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంది.