Win Rs 15 Lakh from Center: కేంద్రం నుండి రూ. 15 లక్షలు గెలుచుకునే అవకాశం, మీరు చేయవలిసిందల్లా పేరు, ట్యాగ్‌లైన్‌, లోగోను సూచించడమే, పోటీకి సంబంధించిన వివరాలను MyGovIndia ట్విట్టర్లో పొందుపరిచిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఈ మేరకు MyGovIndia ట్వీట్ చేసింది.

You Can Win Rs 15 Lakh From Modi Government (Photo-Twitter)

New Delhi, July 28: ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం నుండి 15 లక్షల రూపాయలు గెలుచుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా అభివృద్ధి ఆర్థిక సంస్థ కోసం “పేరు, ట్యాగ్‌లైన్ మరియు లోగో” పోటీలో పాల్గొనడం. మీ సృజనాత్మకతతో మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడానికి ఏర్పాటు చేయనున్న అభివృద్ధి ఆర్థిక సంస్థ (డీఎఫ్‌ఐ)కు తగిన పేరు, ట్యాగ్‌లైన్‌, లోగోను సూచించి రూ.15 లక్షల నగదు బహుమతిని (You Can Win Rs 15 Lakh From Modi Government) గెలుచుకోవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు MyGovIndia ట్వీట్ చేసింది.

పేరు, ట్యాగ్‌లైన్, లోగో ఎంట్రీలకు సంబంధించి ఒక్కో విభాగంలో విజేతకు రూ.5 లక్షలు, రెండవ బహుమతి గ్రహీతలకు రూ.3 లక్షలు, మూడవ బహుమతి విజేతలకు రూ.2 లక్షలు చొప్పున నగదు బహుమతిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పేరు, ట్యాగ్‌లైన్‌, లోగో ఎంట్రీలు పంపిన ఒక్కరివే ఎంపికైతే రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.15 లక్షల నగదు బహుమతిని గెలుచుకునే అవకాశమున్నదని పేర్కొంది.

తండ్రీ కొడుకులిద్దరూ సీఎంలే, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహరాష్ట్ర, మరికొన్ని రాష్ట్రాలలో సీఎంలుగా తండ్రి కొడుకులు, పూర్తి లిస్ట్ పై ఓ లుక్కేసుకోండి

పేరు, ట్యాగ్‌లైన్, లోగోలు డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ (DFA) ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశాన్ని సూచించేవిగాను, ఆ ఆర్థిక సంస్థ ఏమి చేస్తుంది, ఏమి చేయగలదో అన్నది స్పష్టం చేసేవిగాను ఉండాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దృశ్య సంతకంలాగా, సులభంగా ఉచ్ఛరించేలా, అందరికీ గుర్తుకు వచ్చేలా ఉండాలని పేర్కొంది. పేరు, ట్యాగ్‌లైన్‌, లోగో వాటి వాటి ప్రత్యేకతను చాటినప్పటికీ ఈ మూడు కూడా డీఎఫ్‌ఐ ముఖ్య ఉద్దేశం, లక్ష్యాన్ని కలిసికట్టుగా ప్రతిబింబించేలా ఉండాలని వివరించింది.

Here's MyGovIndia Tweet

సృజనాత్మకత, చైతన్యం, ఇతివృత్తంతో కనెక్ట్ అయ్యే థీమ్‌, ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్‌’ను (Azadi Ka Amrut Mahotsava) జరుపుకునే సందర్భంలో భారత స్ఫూర్తిని ప్రతిబింబించే ఎంట్రీలను పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పోటీ కోసం ఎంట్రీలు పంపడానికి చివరి తేదీ ఆగస్ట్‌ 15 అని వెల్లడించింది.

కర్నాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం, 19 నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేయనున్న కొత్త సీఎం, 2023 మేలోపు కర్ణాటక అసెంబ్లీకి తదుపరి ఎన్నికలు

పేరు, ట్యాగ్‌లైన్ మరియు లోగోలకు మొదటి, రెండవ మరియు మూడవ బహుమతి ఉంటుంది.

పేరు కోసం - మొదటి స్థానానికి రూ .5 లక్షలు, రెండవ స్థానానికి రూ .3 లక్షలు, మూడవ స్థానానికి రూ .2 లక్షలు లభిస్తాయి.

ట్యాగ్‌లైన్ కోసం - మొదటి స్థానం పొందినవారికి రూ .5 లక్షలు, రెండవ స్థానానికి రూ .3 లక్షలు, మూడవ స్థానానికి రూ .2 లక్షలు లభిస్తాయి.

లోగో కోసం - మొదటి బహుమతిలో రూ .5 లక్షలు, రెండవ బహుమతి రూ .3 లక్షలు, మూడవ బహుమతి రూ .2 లక్షలు.