Gujarat Shocker: పోర్న్‌కు బానిసై..చిన్నారులపై అత్యాచారం, రేప్ సమయంలో బాలిక అరిచిందని చంపేసిన కామాంధుడు, గుజరాత్‌లో దారుణ ఘటన, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

అదే పనిగా పోర్న్ వీడియోలు చూస్తూ పది రోజుల వ్యవధిలో ఓ కామాంధుడు అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులపై అత్యాచారానికి (Rape) ఒడిగట్టాడు. అంతేకాకుండా ముగ్గురిలో ఒక చిన్నారి అత్యాచార సమయంలో ఎక్కువగా కేకలు వేయడంతో ఆమెను (Raping 3 Minors, Killing 1 In 10-Day Span) హతమార్చాడు. ఈ దారుణ సంఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది.

Image used for representational purpose | (Photo Credits: PTI)

Ahmedabad, Nov 10: అదే పనిగా పోర్న్ వీడియోలు చూస్తూ పది రోజుల వ్యవధిలో ఓ కామాంధుడు అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులపై అత్యాచారానికి (Rape) ఒడిగట్టాడు. అంతేకాకుండా ముగ్గురిలో ఒక చిన్నారి అత్యాచార సమయంలో ఎక్కువగా కేకలు వేయడంతో ఆమెను (Raping 3 Minors, Killing 1 In 10-Day Span) హతమార్చాడు. ఈ దారుణ సంఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌లోని వన్సజాదా గ్రామానికి చెందిన 26 ఏళ్ల విజయ్ ఠాకూర్ అనే వ్యక్తి ఇప్పటి వరకు 3, 5, 7 ఏళ్ల వయసున్న చిన్నారులను కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

వీరిలో మూడేళ్ల చిన్నారి ఎక్కువగా అరవడంతో ఆమెను హత్య చేసి మృతదేహాన్ని ఓ కల్వర్టులో పడేశాడు. తాజాగా గాంధీనగర్ జిల్లాలో నవంబర్‌ 4న తన ఐదేళ్ల కుమార్తెను గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేసి చేశాడని ఓ మహిళ సంతేజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను ఏకాంత ప్రదేశంలో వదిలేసాడని తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. రెండు రోజుల తర్వాత, ఖత్రాజ్ చౌరస్తా సమీపంలోని ఇంటి నుంచి మూడేళ్ల బాలికను నవంబర్ 5 రాత్రి కిడ్నాప్ చేశారని పేర్కొంటూ సంతేజ్ పోలీసులకు మరో ఫిర్యాదు అందింది.

పెళ్లికి ఒప్పుకోలేదని లవర్  గొంతు కోసి చంపేసిన ప్రేమోన్మాది, పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గోదావరిఖని పోలీసులు

సిసిటివి ఫుటేజీల పోలీసులు విచారించగా ఈ కిడ్నాప్‌లు చేసింది విజయ్‌ ఠాకూర్‌ అనే వ్యక్తి తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని (Young labourer Arrested In Gujarat) తమదైన శైలిలో ప్రశ్నించగా.. ఐదేళ్ల బాలికతో పాటు మూడేళ్ల బాలికపై కూడా అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే, ఆ బాలిక ఎక్కువగా కేకలు వేయడంతో ఠాకూర్ ఆమెను హత్య చేసి, ఆపై అత్యాచారం చేశాడని నిందితుడు అంగీకరించాడు. మృతదేహాన్ని కల్వర్టులో పడేసినట్టు తెలిపాడు. అంతేగాక పది రోజుల క్రితం ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసినట్టు ఒప్పుకున్నాడు.

వీడు మనిషేనా, ఇంట్లో ఒంటరిగా ఉన్న అవ్వపై దారుణంగా అత్యాచారం, నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిన వృద్ధురాలు, నిందితుడిని అరెస్ట్ చేసిన థానే పోలీసులు

కాగా చిన్నారి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి పెళ్లయి ఓ కూతురు కూడా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. అతనికి పోర్న్ వీడియోలు చూసే అలవాటు వల్ల వికృత మనస్తత్వం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోక్సో, హత్యా నేరాల కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement