Mumbai, Nov 9: దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముదుసలి వరకు ఎవర్నీ కామాంధులు వదలడం లేదు. తాజాగా దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. థానె జిల్లాలో వృద్ధురాలిపై 25 ఏండ్ల సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి (Guard held for raping mentally ill senior citizen) పాల్పడ్డాడు.
దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే.. థానె నగరంలోని ఓ హౌసింగ్ సొసైటీలో ఓ యువకుడు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆ సొసైటీలోని ఒక ఇంట్లో ఓ మతి స్థిమితం లేని వృద్ధురాలు (mentally ill senior citizen) ఒంటరిగా నివసిస్తోంది. అప్పుడప్పుడు ఆమె బంధువులు తనని చూడటానికి వచ్చి పోతూ ఉంటారు. ఇదంతా గమనించిన ఆ యువకుడు ఓ రోజు మంచినీళ్ల నెపంతో వృద్ధురాలి ఇంట్లోకి వెళ్లాడు. ఆమె నీళ్లు తీసుకునేందుకు వెళుతుండగా ఒక్కసారిగా ఆమెపై పడ్డాడు. తలుపులు వేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల 3న ఈ దారుణం జరగగా.. ఘటన జరిగినప్పటి నుంచి ఆమె బాధపడుతూ ఉండేసరికి ఇరుగు పొరుగు వాళ్ళు ఆమెను డాక్టర్ దగరకు తీసుకెళ్లగా నిజం బయటపెట్టింది.
దీంతో వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతనిపై సంబంధిత సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కథనాన్ని ToI ప్రచురించింది.