Image used for representational purpose only | (Photo Credits: IANS)

మైనర్ బాలికలపై అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి. తాజాగా జరిగిన ఘటన సమాజం తలదించుకునే విధంగా ఉంది. తొమ్మిదో తరగతి విద్యార్థినిపై పక్కింటి వ్యక్తి అతని ఇద్దరు కుమారులు అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తుమందు ఇచ్చి.. ఆపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంది. రెండు నెలలపాటు తనను అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. ఈ ఘటన హర్యానాలోని పానిపట్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హర్యానాలోని పానిపట్ ​లోని మోడల్​ టౌన్​లో కుటుంబ సభ్యులతో ఆ బాధితురాలు నివసిస్తుంది. తన ఇంటిపక్కనే ఉంటున్న అజయ్​ అనే యువకుడు.. ఆ బాలికను ప్రేమిస్తున్నానంటూ మాయ మాటలు చెప్పాడు. ఆ మాటలు ఆ బాలిక మొదట ఒప్పుకోలేదు. బలవంతంగా ఒప్పించాడు. ఇలా ఆమె అతడి ప్రేమలో పడిపోయింది. ఓ రోజు ఆ బాలికను అజయ్ తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే వాళ్ల ఇంట్లో అతడి సోదరుడు, తండ్రి ఉన్నారు. మొదట ఆ బాలిక భయపడిపోయింది.

అజయ్ తండ్రి సదర్, అజయ్ సోదరుడు అర్జున్.. ఆ బాలికకు కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు బాలికపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలికను బయటకు పంపించకుండా.. రహస్యంగా ఇంట్లోనే ఉంచారు. తన కూతురు కనిపించడం లేదంటూ బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించింది.

అయితే ఆ బాలికను ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా రెండు నెలల పాటు బాలికను వాళ్లు ఇంట్లోనే బంధించి రాక్షసంగా కామ వాంఛ తీర్చుకున్నారు. ఇలా ఆమెకు డ్రగ్స్ ను అలవాటు చేశారు. మానసికంగా, శారీరకంగా ఆమెకు అక్కడ ఏం జరుగుతుంతో తెలియని పరిస్థితికి వచ్చింది. అయితే ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకుని తన ఇంటికి చేరుకున్న బాధితురాలు.. విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో పోలీసులుకు ఆ తల్లి ఫిర్యాదు చేసింది. రెండు నెలల పాటు ఆమెపై అత్యాచారం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ విషయంలో పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని.. బాధితురాలికి ఎలాంటి వైద్య పరీక్షలు చేయించలేదని వాపోయింది.

దీంతో సీఎం నివాసానికి వెళ్లిన బాధిత కుటుంబం తమ గోడు విన్నవించుకున్నారు. దీంతో స్పందించిన సీఎం తక్షణమే పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అప్రమత్తమైన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి.. అజయ్​, అర్జున్​, సదర్​, అజయ్​ తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.