Rape (photo-Rep)

Chennai, Feb 7: తమిళనాడులో నాలుగు నెలల గర్భిణిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి, ఈ క్రమంలో సదరు మహిళ ప్రతిఘటించడంతో కదులుతున్న రైలు నుంచి బయటకు తోసేశారు. దీంతో, సదరు గర్భిణి తీవ్రంగా గాయపడగా.. ఆమెకు ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ సంఘటన రాష్ట్రంలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ప్రతిపక్షం, అధికార డిఎంకె మధ్య రాజకీయ వివాదం చెలరేగింది.ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళితే.. చిత్తూరుకు చెందిన రేవతి(36) తమిళనాడులో కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భిణి. ఈ క్రమంలో చిత్తూరులో ఉన్న ఆమె తన తల్లి వద్దకు వెళ్లిందుకు గురువారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కోయంబత్తూరు-తిరుపతి ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. బాధితురాలు రైలులోకి ఎక్కి మహిళల కోచ్‌లో కూర్చుంది. తాను కోచ్‌లోకి ఎక్కిన సమయంలో ఆమె పాటుగా మరికొందరు మహిళలు కూడా ఉన్నారు.

హైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్ ..బాలికపై ఐదుగురు యువకుల సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు

కాగా, రైలు జోలార్‌పేట రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే కోచ్‌లో మహిళలు అందరూ దిగిపోగా రేవతి ఒక్కరే ఉన్నారు. ఆ స్టేషన్‌లోనే నిందితులు ఇద్దరూ హేమరాజ్‌(27) మహిళల కోచ్‌కి ఎక్కారు. కోచ్‌లో ఎవరూ లేకపోవడంతో ఆమెపై లైంగిక దాడికి (Pregnant Woman Sexually Assaulted) ప్రయత్నించారు. ఆ మహిళ వాష్‌రూమ్‌కు వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. ఆ మహిళ సహాయం కోసం కేకలు వేస్తూ వాష్‌రూమ్ వైపు పరిగెత్తింది, కానీ ఆ వ్యక్తులు ఆమెను వెంబడించి వెల్లూరు జిల్లాలోని కాంబైటోర్-తిరుపతి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ నుండి బయటకు నెట్టారు.

ఈ ఘటనలో మహిళ చేయి, కాలు విరిగిపోయాయి, తలకు కూడా గాయాలయ్యాయి. ఆమెను వెల్లూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఆమె చికిత్స పొందుతోంది. ఆ మహిళ కోయంబత్తూరులోని ఒక దుస్తుల కంపెనీలో పనిచేసేది.జోలార్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించింది. నిందితులను గుర్తించడానికి CCTV ఫుటేజ్‌లను తనిఖీ చేయడం ప్రారంభించింది. ఈ కేసులో హేమరాజ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. గతంలో కూడా హత్య, దోపిడీ కేసులో అతన్ని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.