'Young Men Are Not Finding Brides': దేశంలో పెళ్లీడుకొచ్చినా యువకులకు అమ్మాయిలు దొరకడం లేదు, బీజేపీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగం పెరిగిపోవడమే కారణమని విరుచుకుపడిన శరద్ పవార్

పెళ్లీడుకొచ్చినా యువకులకు అమ్మాయిలు దొరకడం లేదని (Young Men Are Not Finding Brides) కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Sharad-Pawar

New Delhi, Jan 5: దేశంలో నిరుద్యోగ సమస్య (Because Of Unemployment) కారణంగానే.. పెళ్లీడుకొచ్చినా యువకులకు అమ్మాయిలు దొరకడం లేదని (Young Men Are Not Finding Brides) కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ జన్‌ జాగర్‌ యాత్ర ప్రచారంలో పాల్గొన్న ఎన్సీపీ అధినేత కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ(షిండే వర్గం పొత్తు) పాలనపై విమర్శలు గుప్పించారు. దేశంలో రెండు వర్గాల ప్రజల మధ్య చీలిక ఏర్పడి ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాస్తవ సమస్యల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం జరుగుతోంది.

ఈ క్రమంలోనే నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. చేసుకునేందుకు వేరే పనులు కూడా దొరకడం లేదు. ఉద్యోగం లేని వాళ్లకు పిల్లను ఎవరు ఇస్తారు? అందుకే వివాహాలు సకాలంలో జరగడం లేదు అని ఆయన అభిప్రాయపడ్డారు. బాగా చదువుకున్న వాళ్లు.. తమకు ఉద్యోగాలు కావాలని ప్రభుత్వాల్ని నిలదీయాలి. అది వాళ్ల హక్కు కూడా అని పవార్‌ సూచించారు.

మంచి మూడ్‌లో ఉన్నప్పుడు అలాంటి విషయాలు అడుగుతారేంటి? అవొద్దు.. విలేకర్లతో మమతా బెనర్జీ

రైతు సమస్యలపై పవార్ (NCP chief Sharad Pawar ) మాట్లాడుతూ.. దేశంలో రైతులు ఉత్పత్తి పెంచితే ఆకలి సమస్య తీరుతుంది. కానీ, అధికారంలో ఉన్నవారు రైతుల శ్రమకు తగ్గ గిట్టుబాటు ధర ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. బదులుగా.. దళారుల ప్రయోజనాలను కాపాడుతూ సామాన్య ప్రజలను ద్రవ్యోల్బణ చట్రంలోకి నెట్టేస్తున్నారు అంటూ కేంద్రం తీరుపై మండిపడ్డారు.

XBB.1.5 కొత్త వేరియంట్ ప్రమాదకరమా, భారత్‌లో ఈ వేరియంట్‌కి సంబంధించి 5 కేసులు నమోదు, ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్ గురించి కొన్ని నిజాలు..

ఎన్నికల సమయంలో ఉద్యోగాల హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించారని కేంద్ర వ్యవసాయశాఖ మాజీ మంత్రి విరుచుకుపడ్డారు. దేశంలో రెండు వర్గాల మధ్య విద్వేషాలు రగులుతున్న పరిస్థితులు చూస్తున్నాం.ఎన్నికల హామీలను నెరవేర్చే దమ్ము వాళ్ల దగ్గర లేదు కాబట్టి అంటూ కేంద్రంలోని బీజేపీపై ఆయన ఘాటు విమర్శ చేశారు.