Mamata In Good Mood: మంచి మూడ్‌లో ఉన్నప్పుడు అలాంటి విషయాలు అడుగుతారేంటి? అవొద్దు.. విలేకర్లతో  మమతా బెనర్జీ
Credits: Twitter

Kolkata, Jan 5: పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ (Vandhe Bharat Express) రైలుపై ఇటీవల జరిగిన రాళ్ల దాడి (Stone Pelting) ఘటనలకు సంబంధించి అడిగిన ఓ ప్రశ్నకు మమతా బెనర్జీ నోటి నుంచి ఊహించని సమాధానం వచ్చింది. హౌరా-న్యూ జల్పాయిగురి మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ రైలును గత నెల 30న ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) ప్రారంభించారు. ఆ తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు రైలుపై రాళ్లదాడి జరిగింది.

అమెజాన్ నుంచి 18 వేల మందికి ఉద్వాసన.. సంస్థ సీఈవో వెల్లడి

ఈ ఘటన రాజకీయంగానూ దుమారం రేపింది. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైలుపై జరిగిన రాళ్ల దాడి ఘటనల గురించి విలేకరులు మమతను ప్రశ్నించారు. స్పందించిన మమత తానిప్పుడు మంచి మూడ్‌లో ఉన్నానని, ఈ సమయంలో ఇలాంటి ప్రశ్నలు తగవని అన్నారు. తాను గంగాసాగర్ మేళాకు వెళ్తున్నానని, మంచి మూడ్‌లో ఉన్నానని, మీరు ఏదైనా అడగదలచుకుంటే గంగాసాగర్ గురించి అడగాలని సూచించారు.

XBB.1.5 కొత్త వేరియంట్ ప్రమాదకరమా, భారత్‌లో ఈ వేరియంట్‌కి సంబంధించి 5 కేసులు నమోదు, ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్ గురించి కొన్ని నిజాలు..

గంగాసాగర్ మేళా ఈ నెల 8 నుంచి 17 వరకు జరుగుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మమత పరిశీలించనున్నారు. అలాగే, అక్కడ ఏర్పాటు చేసిన మూడు శాశ్వత హెలిప్యాడ్‌లను నేడు ప్రారంభించాల్సి ఉంది. అక్కడికి బయలుదేరుతున్న సమయంలో మమత వద్ద విలేకర్లు వందేభారత్ రైలుపై జరిగిన రాళ్ల దాడి ఘటనలను ప్రస్తావించారు. దీంతో ఆమె పై విధంగా సమాధానం చెప్పారు.