Stone Pelting on Vande Bharat (Photo-Twitter)

VJY, April 6: భారత రైల్వే శాఖ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా.. జైల్లో పెడతామని హెచ్చిరించినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. తెలుగు రాష్ట్రాల వందే భారత్ రైలుపై మరోసారి రాళ్లదాడి (Stone Pelting on Vande Bharat) జరిగింది. బుధవారం సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్‌పై (Vande Bharat Express) అగంతకులు రాళ్లదాడి చేశారు. ఖమ్మం-విజయవాడ మధ్యలో ఉన్న రైలుపై అంగతకులు రాళ్లు విసిరారు. దీంతో.. C8 కోచ్ అద్దాలు పగిలిపోయాయి.

నిన్న బర్రెలు, ఇవాళ ఆవులు, వందేభారత్ ట్రైన్‌కు మరో ప్రమాదం, ఆవు ఢీకొట్టడంతో ముందుభాగం డ్యామేజ్, వందే భారత్ ట్రైన్ క్వాలిటీపై విమర్శలు

కోచ్‌ మరమ్మత్తుల నేపథ్యంలో ఇవాళ(గురువారం) విశాఖ నుంచి రైలు ఆలస్యంగా బయలుదేరుతోంది. విశాఖ నుంచి 5.45కు బయలుదేరి వెళ్లాల్సిన వందే భారత్ ఆలస్యం..షెడ్యూల్ కంటే ఆలస్యంగా 9-.45కి బయలుదేరనుంది. గతంలోనూ ఈ రూట్‌లో వందే భారత్‌పై రాళ్ల దాడులు జరిగాయి. ఫిబ్రవరిలో ఖమ్మం రైల్వే స్టేషన్‌ సమీపంలో, అంతకు ముందు సైతం ఓసారి ఇలాగే దాడి జరిగింది. వరుసగా రైళ్లపై రాళ్ల దాడి జరగడంతో దక్షిణమధ్య రైల్వే సీరియస్‌గా స్పందించింది. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకు ఇక ఆరు గంటలే, ఏప్రిల్ 8న సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ ట్రైన్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ

రాళ్లదాడికి పాల్పడే నిందితులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. అంతేకాదు.. ఇలా నేరం చేసిన వారిపై కేసులు నమోదు చేసిన కేసుల్లో 39 మందిని అరెస్టు చేశారు కూడా. ఇదిలా ఉంటే.. శనివారం కొత్తగా సికింద్రాబాద్‌-తిరుపతి రూట్‌లో వందేభారత్‌ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.