Zakir Hussain Dies at 73: జాకీర్ హుస్సేన్ ఇకలేరు, గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మరణించిన మ్యూజిక్ లెజెండ్
గుండె సంబంధిత వ్యాధితో గతవారం ఆస్పత్రిలో చేరిన ఆయన కన్నుమూశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. అయితే ఆయన మరణవార్తను ఇంకా ఎవరూ ధృవీకరించలేదు.
New Delhi, DEC 15: ప్రముఖ తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్ (Zakir Hussain Passes Away) ఇకలేరు. గుండె సంబంధిత వ్యాధితో గతవారం ఆస్పత్రిలో చేరిన ఆయన కన్నుమూశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. అయితే ఆయన మరణవార్తను ఇంకా ఎవరూ ధృవీకరించలేదు. 73 ఏళ్ల జాకీర్ హుస్సేన్ (Zakir Hussain) కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు. గతవారం గుండె సంబంధిత సమస్య ఎక్కువ అవ్వడంతో ఆస్పత్రిలో చేర్పించినట్లు రాకేష్ చౌరస్యా తెలిపారు. అయితే కాసేపటికే ఆయన మరణించినట్లు తెలుస్తోంది.
Zakir Hussain, Tabla Maestro and Percussionist, Dies at 73
జాకీర్ హుస్సేన్ అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేది వాహ్ తాజ్ యాడ్. తన తబలా వాద్యంతో లక్షలాది మందిని ఉర్రూతలూగించిన ఆయన...90వ దశకంలో వాహ్ తాజ్ యాడ్ తో (Wah Taj) ఫేమస్ అయ్యారు. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మవిభూషన్ పురస్కారాలను అందించింది. ఇక బెస్ట్ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్ కు గానూ జాకీర్ హుస్సేన్ కు గ్రామీ అవార్డు కూడా దక్కింది.