ZyCoV-D COVID-19 Vaccine: భారత్‌లో అందుబాటులోకి రానున్న మరో కోవిడ్19 వ్యాక్సిన్, 'జైకోవ్-డి' అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకున్న జైడస్ కాడిలా ఫార్మా సంస్థ, పిల్లలకు సురక్షితం అని ప్రకటన

ఈ టీకా 12 నుంచి 18 సంవత్సరాల మధ్య పిల్లలకు సురక్షితం అని పేర్కొన్న జైడస్ కంపెనీ....

Zydus Cadila (Photo Credits: Twitter)

New Delhi, July 1: భారత్‌లో మరో కోవిడ్ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతీయ ఫార్మా సంస్థ ' జైడస్ కాడిలా' తాము అభివృద్ధి పరిచిన జైకోవ్-డి (ZyCoV-D) కోవిడ్ టీకాను దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతించాల్సిందిగా గురువారం కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (డిసిజీఐ)కు దరఖాస్తు చేసుకుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాస్మిడ్ డిఎన్ఎ సాంకేతికతో అభివృద్ధిపరిచిన జైకోవి-డి వ్యాక్సిన్ "సూది అవసరం లేనిది" అని లేనిది మరియు ఇది పిల్లలకు సురక్షితం అని సంస్థ పేర్కొంది. ఇది మూడు డోసులుగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్, ఏటా 120 మిలియన్ మోతాదుల షాట్‌ను ఉత్పత్తి చేయాలని జైడస్ కాడిలా కంపెనీ యోచిస్తోంది.

దేశంలో ఇప్పటికే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్, రష్యా యొక్క స్పుత్నిక్ V మరియు యూఎస్- అభివృద్ధి చేసిన మోడెర్నా టీకాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇప్పుడు జైకోవి-డి వ్యాక్సిన్ కూడా ఆమోదం పొందితే ఇది భారతదేశంలో వినియోగించబడే ఐదవ కరోనా టీకా అవుతుంది.

ఎక్కువగా లక్షణాలు కలిగిన కోవిడ్ కేసులకు ఈ జైకోవి-డి టీకా 66.6 శాతం మరియు మితమైన లక్షణాలు కలవారికి 100 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని జైడస్ పేర్కొంది. ఈ టీకా 12 నుంచి 18 సంవత్సరాల మధ్య పిల్లలకు సురక్షితం అని పేర్కొన్న జైడస్ కంపెనీ, దేశవ్యాప్తంగా 28,000 మందికి పైగా వాలంటీర్లతో చివరి దశలో జరిగిన ప్రయోగాలలో ZyCoV-D భద్రత మరియు సామర్థ్యాన్ని చూపించిందనికంపెనీ పేర్కొంది. వాలంటీర్లలో 12-18 ఏళ్ల ఉన్న సుమారు 1000 మందికి కూడా టీకాను ప్రయోగించినట్లు తెలిపారు.

ఈ టీకా 2 నుండి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది, అయినప్పటికీ మూడు నెలల పాటు 25 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా తమ టీకా మంచి స్థిరత్వాన్ని చూపించిందని, దీనివల్ల వ్యాక్సిన్ రవాణా చేయడంలో మరియు నిల్వ చేయడంలో ఇబ్బందులు తగ్గుతాయని కంపెనీ తెలిపింది. అలాగే జైకోవ్-డి వ్యాక్సిన్ ప్లాస్మిడ్ డిఎన్ఎ కావడం ద్వారా ఇది తీసుకున్న తర్వాత రోగనిరోధకతకు సంబంధించి ప్రభావాలు కనిపించవని జైడస్ కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.



సంబంధిత వార్తలు