Nirbhaya Case: నిర్భయ కేసు దోషి అక్షయ్ కుమార్ ఠాకూర్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

ఉరిశిక్ష అమలు తప్పించుకునేందుకు అన్ని రకాల న్యాయపరమైన అవకాశాలను, లేని అవకాశాలను సైతం సృష్టించి వినియోగించుకున్న నిర్భయ కేసు దోషులకు ఇప్పుడు మిగిలిన చివరి మరియు ఏకైక అవకాశం రాష్ట్రపతి క్షమాభిక్ష. కాగా, ఈ కేసులో ఇప్పటివరకు....

Nirbhaya case convict Akshay Singh | File Photo

New Delhi, February 06: నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన దోషుల్లో ఒకరైన అక్షయ్  ఠాకూర్ (Akshay Thakur) క్షమాభిక్ష పిటిషన్ (Mercy Petetion) ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Ram Nath Kovind) తిరస్కరించారు. దీంతో ఇతడికి ఉన్న చట్టపరమైన అవకాశాలన్నీ ముగిశాయి. ఫిబ్రవరి 1న ఉరితీత ఉందనగా ఒకరోజు ముందు అక్షయ్ ఠాకూర్ రాష్ట్రపతి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నాడు. దీంతో ఈ కేసులోని దోషులందరికీ మరణ శిక్ష అమలు వాయిదా పడింది. అంతకుముందు జనవరి 22న ఉరితీత అమలు జరగాల్సి వచ్చినపుడు మరో దోషి ముఖేశ్ సింగ్ చివరి నిమిషంలో రాష్ట్రపతి క్షమాభిక్ష కోరాడు, అప్పుడూ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో దిల్లీ హైకోర్ట్ నిన్న కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులోని దోషులందరూ వారం రోజుల్లో తమ చట్టపరమైన అవకాశాలను వినియోగించుకోవాలని ఆదేశించింది. ఆ తర్వాత ఉరితీత అమలుపై విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది.

ఉరిశిక్ష అమలు తప్పించుకునేందుకు అన్ని రకాల న్యాయపరమైన అవకాశాలను, లేని అవకాశాలను సైతం సృష్టించి వినియోగించుకున్న నిర్భయ కేసు దోషులకు ఇప్పుడు మిగిలిన చివరి మరియు ఏకైక అవకాశం రాష్ట్రపతి క్షమాభిక్ష. కాగా, ఈ కేసులో (2012 Nirbhaya Gang Rape & Murder) ఇప్పటివరకు ముగ్గురు దోషుల క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఇక క్షమాభిక్ష దాఖలు చేసుకోవడానికి పవన్ గుప్తా ఒక్కడే మిగిలి ఉన్నాడు.

ANI's update:

ఈ దోషుల తరఫున వాదిస్తున్న క్రిమినల్ లాయర్ లేని అవకాశాలను సృష్టిస్తూ న్యాయపరమైన చిక్కులతో వీరి ఉరితీత అమలును వాయిదావేయిస్తూ పోతున్నారు. ఇప్పుడు దిల్లీ హైకోర్ట్ దోషులకు వారం రోజులే గడువు ఇచ్చిన నేపథ్యంలో గడువు చివరి రోజును ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంను ఆశ్రయించే అవకాశం ఉంది.  దిల్లీ కోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేంద్ర ప్రభుత్వం 

ఇప్పటివరకూ ఇదే రకంగా చేస్తూ శిక్ష అమలు తేదీని దూరం పెంచుతూ పోయారు. వారికి ఎట్టి పరిస్థితుల్లో ఉరిశిక్ష పడను అని ఈయన నిర్భయ తల్లితో ఛాలెంజ్ చేశారు. ఈ న్యాయపోరాటంలో ఎవరు గెలుస్తారో మున్ముందు తెలుస్తుంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now