Omicron In India: రోజుకి విస్తరిస్తున్న ఒమిక్రాన్, పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య, మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం
దేశంలో గడిచిన 24 గంటల్లో 9 కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే శుక్రవారం ఒక్క రోజే 7 కేసులువచ్చాయి.
భారత్‌లో ఒమిక్రాన్ (Omicron)వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 9 కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే శుక్రవారం ఒక్క రోజే 7 కేసులువచ్చాయి. ముంబైలో 3, పింప్రిలో 4 కేసులు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోనూ మరో రెండు పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇటీవల జింబాబ్వే నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ (Omicron)వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అతని భార్య, బావమరిదికి కూడా ఒమిక్రాన్ (Omicron)సోకినట్టు జామ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. దీంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. దేశంలో ఇప్పటి వరకు నిర్ధారణ అయిన ఒమిక్రాన్ (Omicron)కేసుల సంఖ్య 32కు పెరిగింది.
మహారాష్ట్రలో మాత్రమే ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ (Omicron)కేసుల సంఖ్య 17కు చేరింది. ఇది దేశంలోనే అత్యధికం. ఒమిక్రాన్ (Omicron)కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఒమిక్రాన్ (Omicron)కట్టడి దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలో ఇవాళ, రేపు సెక్షన్ 144 విధించింది. దీంతో ముంబైలో ర్యాలీలు, సామూహిక కార్యక్రమాలను నిషేధించినట్లయ్యింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.
ముంబైలో సెక్షన్ 144 విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ ర్యాలీల కారణంగా ఒమిక్రాన్ (Omicron)విస్తరించే అవకాశం ఉండటంతో ముంబైలో సెక్షన్ 144 విధించింది. దేశంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ (Omicron)కేసుల సంఖ్య 32కు చేరింది. మహారాష్ట్రలో 17, రాజస్థాన్‌లో 9, గుజరాత్‌లో 3, కర్ణాటకలో 2, ఢిల్లీలో ఒక కేసు నమోదయ్యింది.