Sansad TV: పార్లమెంట్ ఉభయ సభ ప్రత్యక్ష ప్రసారాల కోసం ప్రభుత్వం నుంచి కొత్త టీవీ ఛానెల్, 'సంసద్ టీవీ' ని నేడు ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి, ప్రధాని మరియు లోకసభ స్పీకర్

ఇదే రోజున ప్రజాస్వామ్య నిలయమైన పార్లమెంటు కార్యకలాపాలను ప్రజలకు చూపించే సంసద్ టీవీ ప్రారంభోత్సవం జరగడం అనేది విశేషం...

Parliament of India | File Photo

New Delhi, September 15:  పార్లమెంట్ ఉభయ సభలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు భారత ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 'సంసద్' టెలివిజన్ ఛానెల్ ను బుధవారం లాంఛ్ చేయనున్నారు. ప్రస్తుతం వేర్వేరుగా ప్రసారం అవుతున్న లోకసభ, రాజ్యసభ ఛానెళ్ల స్థానంలో ఈ సంసద్ టీవీ (పార్లమెంట్ టీవీ) రాబోతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల కు పార్లమెంట్ భవనం లోని ప్రధాన కమిటీ రూంలో ఉప రాష్ట్రపతి మరియు రాజ్య సభ చైర్మన్ వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లాలు కలిసి సంయుక్తంగా ఛానెల్ ను ప్రారంభించనున్నారు. ఈరోజు సెప్టెంబర్ 15 ప్రజాస్వామ్యం అంతర్జాతీయ దినోత్సవం (ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమొక్రసీ) గా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇదే రోజున ప్రజాస్వామ్య నిలయమైన పార్లమెంటు కార్యకలాపాలను ప్రజలకు చూపించే సంసద్ టీవీ ప్రారంభోత్సవం జరగడం అనేది విశేషం.

Here's the update: 

ఇదివరకు ఉన్న లోకసభ, రాజ్య సభ ఛానళ్లను విలీనం చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తీసుకుంది. అనంతరం సంసద్ టీవీకి CEOను 2021 మార్చి నెలలో నియమించారు.

ఈ సంసద్ టీవీలో ప్రధానంగా నాలుగు కేటగిరీలకు చెందిన కార్యక్రమాలు ఉంటాయి, అవి ఏంటంటే; పార్లమెంట్ మరియు ప్రజాస్వామిక సంస్థల పనితీరు, ప్రభుత్వ పథకాల అమలు మరియు పరిపాలనా విధానాలు, భారతదేశ చరిత్ర, సంస్కృతి సాంప్రదాయాలతో పాటు సమకాలీక స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి అంశాలు, ప్రయోజనాలు, తదితర వ్యవహారాలను సంసద్ టీవీ ప్రసారం చేయనుంది.