AAP's New Slogan: అచ్చే బీతే పాంచ్ సాల్..లగే రహో కేజ్రీవాల్, కొత్త నినాదంతో ఎన్నికలకు రెడీ అవుతున్న ఆప్, మళ్లీ అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదును, కేజ్రీవాల్‌తో జత కట్టిన ప్రశాంత్ కిషోర్

వచ్చే ఏడాది దేశ రాజధాని ఢిల్లీలో సార్వత్రిక సమరం (Delhi Assembly poll) మొదలు కానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు అన్ని అవకాశాలను వెతికే పనిలో పడ్డాయి. అధికారంలో ఉన్న కేజ్రీవాల్ సర్కార్ (Arvind Kejriwal) మళ్లీ ఢిల్లీలో ఆప్ జెండాను పాతాలని చూస్తోంది.

Ache beete 5 saal, lage raho Kejriwal (Photo-IANS)

New Delhi, December 20: వచ్చే ఏడాది దేశ రాజధాని ఢిల్లీలో సార్వత్రిక సమరం (Delhi Assembly poll) మొదలు కానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు అన్ని అవకాశాలను వెతికే పనిలో పడ్డాయి. అధికారంలో ఉన్న కేజ్రీవాల్ సర్కార్ (Arvind Kejriwal) మళ్లీ ఢిల్లీలో ఆప్ జెండాను పాతాలని చూస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనే ఢిల్లీని వదులుకోకూడదని అక్కడ కాషాయపు జెండా ఎగరరేయాలని వ్యూహాలను రచిస్తోంది.

ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన ఆప్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను (Prashant Kishor)నియమించుకుంది. పనిచేసిన చోటల్లా గెలుపు బావుటా ఎగరేసిన ప్రశాంత్ కిషోర్ ఆమ్ ఆద్మీ పార్టీ కోసం అప్పుడు పని ప్రారంభించాడు. ఇందులో భాగంగా ఆప్ స్లోగన్ విడుదల చేశారు.

Here's Slogan

ప్రజలను ఆకర్షించే పథకాలను ఇప్పటికే తీసుకొచ్చిన ఆప్ (AAP)తాజాగా 2020 ఎన్నికలకు కొత్త నినాదం ఎత్తుకుంది. ప్రజల మెదల్లోకి సులువుగా వెళ్లే విధంగా స్లోగన్ తయారు చేసింది. ‘అచ్చే బీతే పాంచ్ సాల్..లగే రహో కేజ్రీవాల్’..(Ache beete 5 saal, lage raho Kejriwal)అంటూ కొత్త స్లోగన్‌తో ప్రచారం నిర్వహించాలని ఆప్ నిర్ణయించింది. ఐదు సంవత్సరాలు మంచిగా గడిచిపోయాయి..కేజ్రీవాల్‌‌ జిందాబాద్ అనే అర్థం వస్తుంది.

ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిశోర్ I-PAC కమిటీ (Indian Political Action Committee) 2014లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఎంతగానో కృషి చేసింది. ఏపీ ఎన్నికల్లో వైసీపీ విజయంలో ప్రశాంత్ కిశోర్ కీలక రోల్ పోషించారు. రెండేళ్ల పాటు జగన్‌కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. అయితే యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పనిచేసినా ఆయన పన్నిన వ్యూహాలు సక్సెస్ కాలేదు. జన్ లోక్ పాల్ బిల్లు కోసం ప్రముఖ గాంధేయవాది, సామాజిక కార్యకర్త అన్నా హాజారేతో కలిసి అరవింద్ కేజ్రీవాల్ ఉద్యమించారు. అనంతరం 2012 నవంబర్‌లో ఆమ్ ఆద్మీ పేరిట పార్టీని స్థాపించారు.

తొలిసారి ముఖ్యమంత్రిగా 49 రోజుల పాటు పదవిలో కొనసాగారు కేజ్రీవాల్. జనలోక్ పాల్ బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో ఆయన రాజీనామా చేశారు. తర్వాత 2015 ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో విజయదుంధుబి మ్రోగించింది. రెండోసారి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. కానీ..MCD ఎన్నికల్లో మాత్రం ఆప్‌కు ఎదురు దెబ్బలు తగిలాయి. తిరిగి మరోసారి అధికారాన్ని దక్కించుకొనేందుకు కేజ్రీవాల్ సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా కొత్త నినాదంతో ఇప్పటినుంచే దూకుడును ప్రారంభించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now