Bharat Jodo Yatra: హర హర మహాదేవ్, జైశ్రీరామ్‌ అంటూ ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ నినదించలేదు, వీళ్లంతా ఖాకీ లాగులు తొడుక్కున్న 21వ శతాబ్దపు కౌరవులు, భారత్ జోడో యాత్రలో నిప్పులు చెరిగిన రాహుల్

21 వ శతాబ్దంలో కౌరవులు ఖాకీ లాగులు (wear Khakhi half-pant) తొడుక్కుని, చేతిలో లాఠీతో తిరుగుతున్నారని ఆరోపించారు

Rahul Gandhi (Photo-ANI)

Haryana, Jan 10: హర్యానాలో భారత్ జోడో యాత్రలో(Bharat Jodo Yatra) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) పై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. 21 వ శతాబ్దంలో కౌరవులు ఖాకీ లాగులు (wear Khakhi half-pant) తొడుక్కుని, చేతిలో లాఠీతో తిరుగుతున్నారని ఆరోపించారు.

శాఖల పేరుతో వాళ్లు సమావేశాలు నిర్వహిస్తుంటారని, దేశంలోని ఇద్దరు ముగ్గురు బిలియనీర్లు ఈ కౌరవులకు (Kauravas) మద్దతుగా నిలబడుతున్నారని ఆయన ఆరోపించారు.భారతీయ విలువలకు సంఘ్‌ వ్యతిరేకమని ఆరోపించారు. సంఘ్‌ కార్యకర్తలు హర హర మహాదేవ్, జైశ్రీరామ్‌ అంటూ ఏనాడూ నినదించలేదని ఆక్షేపించారు.

రసాభాసగా మారిన ఢిల్లీ మేయర్ ఎన్నిక, ఆప్‌-బీజేపీ సభ్యుల మధ్య తోపులాట

సోమవారం సాయంత్రం జోడో యాత్ర హర్యానాలోని అంబాలా జిల్లాలోకి ప్రవేశించింది.ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. పాండవుల పాలన ప్రజారంజకంగా ఉండేదని, ఈ నేలపై ద్వేషాన్ని వ్యాపింపజేసే పనులను పాండవులు అసహ్యించుకున్నారని వివరించారు. నోట్ల రద్దు, తప్పుడు జీఎస్టీ వంటి పనులు వాళ్లు ఎన్నడూ చేయలేదని అన్నారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల సామాన్య జనం ఇబ్బందులు పడతారని తెలుసు కాబట్టే పాండవులు ఈ నిర్ణయాలు తీసుకోలేదని రాహుల్ చెప్పారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం రైతులకు నష్టం చేస్తాయని తెలిసీ వ్యవసాయ చట్టాలపై సంతకాలు చేశారని అన్నారు.

Here's ANI Video

మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. ఈ చట్టాల తయారీ వెనక మోదీ బిలియనీర్ మిత్రులే ఉన్నారని, వాళ్లే ఆయనతో సంతకాలు చేయించారని రాహుల్ ఆరోపించారు. ప్రజలకు అర్ధం కాకపోవచ్చు కానీ అప్పుడు కౌరవులు, పాండవుల మధ్య మహాభారత యుద్ధం జరిగినట్లే ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతోందని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ఖాకీ లాగులు తొడుక్కుని తిరుగుతున్న కౌరవులకు, అన్ని వర్గాల ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందని రాహుల్ తెలిపారు.

దేశంలో పెళ్లీడుకొచ్చినా యువకులకు అమ్మాయిలు దొరకడం లేదు, బీజేపీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగం పెరిగిపోవడమే కారణమని విరుచుకుపడిన శరద్ పవార్

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎముక‌లు కొరికే చ‌లిలోనూ టీ ష‌ర్ట్ ధ‌రించి జోడో యాత్ర‌లో పాల్గొంటున్న విష‌యం విదిత‌మే. రాహుల్ టీ ష‌ర్ట్‌పై బీజేపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. టీ ష‌ర్ట్ లోప‌ల థ‌ర్మ‌ల్స్ ధ‌రిస్తున్నార‌ని రాహుల్‌పై ఆరోప‌ణ‌లు వెలువెత్తుతున్నాయి.ఈ నేప‌థ్యంలో రాహుల్ గాంధీ స్పందించారు. గ‌జ గ‌జ వ‌ణికిస్తున్న చ‌లిలోనూ తాను టీ ష‌ర్ట్ ఎందుకు ధ‌రిస్తున్నాన‌నే విష‌యంపై రాహుల్ వివ‌ర‌ణ ఇచ్చారు. బీజేపీ నాయ‌కులు స‌మ‌స్య‌ను అర్థం చేసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. నేను యాత్ర ప్రారంభంలో కూడా టీ ష‌ర్ట్ ధ‌రించాను. కేర‌ళ‌లో ఎక్కువ వేడి ఉండ‌టం వ‌ల్లే అప్పుడు టీ ష‌ర్ట్ వేసుకున్నాను.

నా యాత్ర మ‌ధ్య‌ప్ర‌దేశ్ చేరుకోగానే, కొంచెం చ‌లిగా అనిపించింది. ఆ స‌మ‌యంలో ఒక ఉద‌యం నా ద‌గ్గ‌ర‌కు ముగ్గురు పేద పిల్ల‌లు వ‌చ్చారు. వారు చిరిగిన బ‌ట్ట‌లు వేసుకున్నారు. అప్ప‌టికే వారు చ‌లితో వ‌ణికిపోతున్నారు. ఆరోజే నిశ్చ‌యించుకున్నాను. నాకు చ‌లిగా అనిపించిన‌ప్ప‌టికీ స్వెట‌ర్ ధ‌రించొద్ద‌ని డిసైడ్ అయ్యాను. కేవ‌లం టీ షర్ట్ మాత్ర‌మే ధ‌రించాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఆ పిల్ల‌ల కంటే నేనేం ఎక్కువ కాదు అని రాహుల్ పేర్కొన్నారు.

భారత్‌ తపస్వీల దేశమని, పూజారుల దేశం కాదంటూ రాహుల్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పూజారులు మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టి, రాహుల్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. తమ సంప్రదాయాన్ని అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. జోడో యాత్రలో ఐక్యత గురించి మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

ప్రస్తుతం జోడో యాత్ర హరియాణాలో కొనసాగుతోంది. ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ యాత్ర జరిగింది. జనవరి 30న కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.



సంబంధిత వార్తలు

Farmers Protest: కనీస మద్దతు ధరపై రైతుల పోరాటం, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కిసాన్ నాయకుడికి తక్షణ వైద్య సహాయం అందించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరిన సుప్రీంకోర్టు

Weather Forecast: ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక, తెలంగాలో పెరుగుతున్న చలి

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ