Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో విషాదం.. యాత్రలో కుప్పకూలిన ఎంపీ.. గుండెపోటుతో మృతి
యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరీ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది దవాఖానకు తరలించగా, ఆయన మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు.
Newdelhi, Jan 14: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్రలో (Bharat Jodo Yatra) విషాదం నెలకొన్నది. యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరీ (Santokh Singh Chaudhary) గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది దవాఖానకు తరలించగా, ఆయన మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. విషయం తెలుసుకొన్న రాహుల్ యాత్రను వాయిదా వేసి హాస్పిటల్ కు చేరారు.