Maharashtra Power Play: మూడు రోజుల ముచ్చటైన సీఎం, డిప్యూటీ సీఎం పదవులు, సీఎం పదవికి ఫడ్నవిస్ రాజీనామా, ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా, బల నిరూపణకు ముందే చేతులెత్తేసిన బీజేపీ

ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) రాజీనామా చేసిన తర్వాత రెండు గంటల్లోనే సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్(devendra fadnavis) కూడా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.

devendra-fadnavis-resign-as-maharashtra-chief-minister and Ajit Pawar resigns as the Deputy Chief Minister of Maharashtra (Photo-ANI)

Mumbai, November 26: ధ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) రాజీనామా చేసిన తర్వాత రెండు గంటల్లోనే సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్(devendra fadnavis) కూడా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ముంబై(Mumbai)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన రాజీనామాను దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.

ఇటీవల జరిగిన మహారాష్ట్ర(Maharashtra) అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మెజారిటీ ఇచ్చారని, అయితే, శివసేన బీజేపీని మోసం చేసిందని ఫడ్నవీస్ ఆరోపించారు. శివసేన పార్టీ ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా వ్యవహరించిందన్నారు. పరస్పర విరుద్ధ అభిప్రాయాలు కలిగిన కాంగ్రెస్ - ఎన్సీపీ - శివసేన కలసి.. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

ANI Tweet

బీజేపీని అధికారానికి దూరం చేయడమే ఆ మూడు పార్టీల ఉమ్మడి కార్యాచరణ అని మండిపడ్డారు. అజిత్ పవార్ ఎన్సీపీ శాసనసభాపక్ష నేత కావడంతో ఆయనతో తాము చర్చలు జరిపామని ఫడ్నవీస్ చెప్పారు. ఆయన మద్దతు ఇస్తామనడంతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

ANI Tweet

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తన పదవి(Deputy Chief Minister)కి రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు 24 గంటలకలో బల నిరూపణ చేసుకోవాలని చెప్పిన నేపథ్యంలో అజిత్ పవార్ బలపరీక్షకు ముందే చేతులెత్తేశారు. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అధిష్ఠానంపై తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపి ఉపముఖ్యమంత్రి పదవిని పొందారు. దీంతో ఎన్సీపీ చీలికపై శరద్ పవార్ భగ్గుమన్నారు.

కుటుంబ సభ్యులతో కలిసి అజిత్ పై ఒత్తిడి తేవడంలో విజయం సాధించారు. తాజాగా అజిత్ ను మళ్లీ పార్టీలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అజిత్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దుచేయలేదని శరద్ పవార్ ప్రకటించారు. నిన్న, కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన ఉమ్మడిగా తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్దతుందంటూ మీడియా ఎదుట పరేడ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. గవర్నర్ ఎదుట బలపరీక్షకు ముందే ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా రాజీనామా చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి.

ANI Tweet

కాగా అజిత్ పవార్ కేవలం 78 గంటలు మాత్రమే పదవిలో ఉన్నారు. శనివారం ఉదయం 8 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా ఈ రోజు మధ్యాహ్నం రాజీనామా చేశారు. కేవలం మూడు రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు.

ఇదిలా ఉంటే అజిత్ దాదా మాతోనే ఉంటారని శివసేన నుంచి ఉద్ధవ్ ఠాక్రే 5 సంవత్సారలు సీఎంగా కొనసాగుతారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో తెలిపారు.



సంబంధిత వార్తలు