Supreme Court: 2019 లోక్‌సభ ఎన్నికల్లో అవకతవకలు, ఎన్నికల కమిషన్‌కు సుప్రీం నోటీస్, 349 లోక్‌సభ నియోజకవర్గాల్లో భారీ వ్యత్యాసం అంటూ పిటిషన్, దాఖలు చేసిన ఏడీఆర్‌,కామన్‌ కాజ్‌ స్వచ్ఛంద సంస్థలు

అయితే ఈ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ పరిశీలించిన సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్(Election Commission)కి నోటీసులు జారీ చేసింది.

Discrepancies In 17th Lok Sabha Election Results Supreme Court issues notice to Election Commission on ‘discrepancies (Photo-ANI)

New Delhi, December 14: 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో (17th Lok Sabha Election)బీజేపీ(BJP) అఖండ మెజార్టీ సాధించి రెండో సారి అధికారం చేపట్టిన సంగతి విదితమే. అయితే ఈ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ పరిశీలించిన సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్(Election Commission)కి నోటీసులు జారీ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ జరపాల్సిందిగా శుక్రవారం దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది.

దాదాపు 347 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యకు, పోలైన ఓట్లకు మధ్య తేడాలు(Discrepancies In 17th Lok Sabha Election Results) ఉన్నాయని, దీనిపై విచారణ జరపాలని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్‌ (ఏడీఆర్‌), కామన్‌ కాజ్‌ (ADR And Common Cause)అనే రెండు స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఇలాంటి తేడాలు రాకుండా ఓ పటిష్టమైన పద్ధతి రూపకల్పనకు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని వీరు నివేదించారు.

ఎన్నికల ఫలితాలను ప్రకటించే ముందుగా అంకెలను స్పష్టంగా లెక్కకట్టాలని కోరింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల పత్రాలు 17సీ, 20, 21సీ, 21డీ, 21ఈల సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచాని ఏడీఆర్‌ కోరింది. దేశవ్యాప్తంగా ఎన్నికల వివాదాన్ని పరిష్కరించుకునేందుకు పిటిషన్‌ వేసుకునేందుకు అవకాశముండగా, ఫలితాల కచ్చితత్వం, అంకెల్లోని తేడాల కారణంగా వచ్చే అనుమానాలను తీర్చేందుకు మాత్రం ఎలాంటి ఏర్పాట్లూ లేవని ఏడీఆర్‌ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది.