Hemant Soren Arrested by ED: ఊహించిందే జరిగింది! హేమంత్ సోరెన్ అరెస్ట్, భూకుంభకోణం కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ, ఆరుగంటల పాటూ విచారించిన తర్వాత అరెస్ట్
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దాదాపు ఆరు గంటలకు పైగా విచారణ అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హేమంత్‌ను రాంచీలోని ఈడీ కార్యాలయానికి తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Ranchi, JAN 31: ఝార్ఖండ్ ముక్తిమోర్చ (JMM) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren)ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దాదాపు ఆరు గంటలకు పైగా విచారణ అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హేమంత్‌ను రాంచీలోని ఈడీ కార్యాలయానికి తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. హేమంత్ సోరెన్ ఈడీ అధికారుల అదుపులో ఉన్నట్లు రాజ్యసభ ఎంపీ మహువా మజీ ధ్రువీకరించారు.
హేమంత్ సోరెన్ రాజీనామా నేపథ్యంలో కొత్త సీఎంగా ఆయన సన్నిహితుడు చంపై సోరెన్‌ను ఎన్నుకున్నారు. ప్రస్తుతం రవాణాశాఖ మంత్రిగా ఉన్న ఆయన సారథ్యంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చంపై సోరెన్ తెలిపారు.
Here's Videos
ఈమేరకు ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు అందజేసినట్లు మరో మంత్రి తెలిపారు. అంతకముందు హేమంత్ సోరెన్.. మంత్రులు అలంగిర్ ఆలం, సత్యానంద్ భొక్తా, చంపై సోరెన్, ఎమ్మెల్యేలు ప్రదీప్ యాదవ్, వినోద్ కుమార్ సింగ్‌లతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు తన రాజీనామా లేఖను అందజేశారు. ఆయన రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.