Goa Assembly Elections 2022: గోవా ఆప్ సీఎం అభ్యర్థిగా అమిత్ పాలేకర్, కుల ఆయుధాన్ని ఎక్కుపెట్టిన ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్, అవినీతిని పాలేకర్ తుడిచేస్తారని వెల్లడి

గోవా రాష్ట్రంలో శక్తిమంతమైన భండారి (ఓబీసీ) సామాజిక వర్గానికి చెందిన పాలేకర్ ను (Lawyer Amit Palekar) ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేజ్రీవాల్ బుధవారం ప్రకటించారు.

Lawyer Amit Palekar

Panaji, Jan 19: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అయిన అరవింద్ కేజ్రీవాల్ గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమ సీఎం అభ్యర్థిని ప్రకటించారు. గోవా రాష్ట్రంలో శక్తిమంతమైన భండారి (ఓబీసీ) సామాజిక వర్గానికి చెందిన పాలేకర్ ను (Lawyer Amit Palekar) ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేజ్రీవాల్ బుధవారం ప్రకటించారు. తద్వారా కుల ఆయుధాన్ని ఎక్కు పెట్టారు. ‘‘అమిత్ పాలేకర్ వృత్తిరీత్యా న్యాయవాది. భండారి సామాజిక వర్గానికి చెందిన వారు.

గోవా జనాభాలో భండారి కమ్యూనిటీ జనాభా 35 శాతంగా ఉంది. ఈ సామాజిక వర్గం నుంచి గతంలో ఒక్కరే రవి నాయక్ రెండేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మేము కుల రాజకీయాలు చేయడం లేదు. భండారి కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలే రాజకీయాలు సాగిస్తున్నాయి’’ అంటూ తన ప్రకటనతో పార్టీ వ్యూహాన్ని బయటపెట్టారు. రాష్టంలో ప్రస్తుత పరిస్థితికి పాత పార్టీలే కారణమంటూ ఆప్ ను గెలిపించాలని కేజ్రీవాల్ గోవా ప్రజలను కోరారు. రాష్ట్రంలో అవినీతిని పాలేకర్ తుడిచేస్తారని, ప్రతి ఒక్కరి కోసం కష్టపడి పనిచేస్తారని ప్రకటించారు. అమిత్ పాలేకర్ (AAP’s chief ministerial candidate ) గతేడాది అక్టోబర్ లో ఆప్ లో చేరడం గమనార్హం.

బావ అఖిలేష్ యాదవ్‌కు షాక్, బీజేపీ తీర్థం పుచుకున్న ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్

కాగా గోవా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పట్టుసాధించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రయత్ని‍స్తోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్‌ మాన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. గోవాలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు (Goa Assembly Elections 2022) ఆప్‌ పోటీ చేస్తుందని వెల్లడించారు. గోవా ప్రజలు ఆప్‌కు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.అయితే గత ఎన్నికల్లో 40 స్థానాలకు గానూ 39 స్థానాల్లో పోటీ చేసిన ఆప్‌ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అయితే ఈ సారి ఆప్‌ గోవాలో అధికారంలోకి వస్తే ఢిల్లీ మోడల్‌లో రాష్ట్రాన్ని అభిృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా 2017లో జరిగిన గోవా ఎన్నికల్లో ఎల్విస్‌ గొమెస్‌ నేతృత్వంలో ఆప్‌ బరిలోకి దిగింది. అయితే ఆయన వివిధ కారణాలతో 2020లో పార్టీని వీడాను. ఈ నేపథ్యంలో ఆప్‌ ఆద్మీ పార్టీ కొత్త సీఎం అభ్యర్థిని రంగంలోకి దింపింది.



సంబంధిత వార్తలు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

One Nation-One Election: పార్లమెంటుకు జమిలి బిల్లు నేడే.. లోక్‌ సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Telangana Assembly Session 2024: తెలంగాణకు వెళితే చికున్ గున్యా వస్తుంది, అమెరికాలో చెప్పుకుంటున్నారంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో..