Haryana Politics: హరియాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది ఎవరు? జేజేపీ షాక్ ఇవ్వడంతో ఇండిపెండెంట్ల వైపు చూస్తున్న బీజేపీ, స్వతంత్రులతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వేగంగా పావులు కదుపుతున్న బీజేపి

దీంతో బీజేపీ స్వతంత్రులకు గాలం వేస్తుంది. ఇటు కాంగ్రెస్ కూడా అదే పనిమీద బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ హరియాణలో ప్రభుత్వం ఎవరిది, సీఎం ఎవరు...

Hariyana Drama | (Photo Credits: IANS)

Chandigarh, October 25:  హరియాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల (Haryana Assembly Election Results 2019) లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో అక్కడ హంగ్ ఏర్పడింది. దీంతో హరియాణలో ఏదైనా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా అది మరో పార్టీతో పొత్తు లేదా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్ధతు తీసుకోవడం అనివార్యమైంది. గురువారం వెలువడిన అసెంబ్లీ ఫలితాలలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ కు 6 ఎమ్మెల్యే సీట్ల దూరంలో నిలిచిపోయింది. హరియాణలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 90, ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 46. కాగా, బీజేపికి 40, కాంగ్రెస్ 31, జేజేపి 10 మరియు స్వతంత్రులు 10 మంది గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు అందరికీ అవకాశం ఉంది. సరిగ్గా ఇక్కడ ఇటీవల కర్ణాటకలో జరిగిన సీన్ మరోసారి రిపీట్ అవుతుంది.

బీజేపీ, 10 సీట్లు గెలిచిన జేజేపి మరియు స్వతంత్రులకు తమకు మద్ధతు ఇవ్వాలంటూ భారీ 'ఆఫర్లు' చేస్తుండగా, కాంగ్రెస్ మాత్రం జేజేపీకి కర్ణాటకలో కుమార స్వామికి సీఎం సీట్ ఆఫర్ ఇచ్చినట్లుగా, ఇక్కడ జేజేపీ అధినేత చౌతాలాకు సీఎం కుర్చీ ఆఫర్ చేసింది.

జేజేపీ అధినేత దుశ్యంత్ చౌతాలా బీజేపీకి షాక్ ఇచ్చేలానే ఉన్నారు, ఆ పార్టీకి మద్ధతు ఇచ్చే ఆలోచనలు లేవని చౌతాలా తేల్చిచెప్పారు. దీంతో బీజేపీ స్వతంత్రులకు గాలం వేస్తుంది. ఇటు కాంగ్రెస్ కూడా అదే పనిమీద బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ హరియాణలో ప్రభుత్వం ఎవరిది, సీఎం ఎవరు అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది.

మరోవైపు హరియాణలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ దాదాపు స్వతంత్ర ఎమ్మెల్యేలను తమ దారికి తెచ్చుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ లాల్ ఖత్తర్ తమ ప్రభుత్వమే ఉంటుందని ధీమాగా ఉన్నారు. హరియాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ సంపూర్ణ మద్ధతు బీజేపీకేనంటూ బహిరంగగానే ప్రకటనలు ఇస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుపై ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ + జేజేపీలు జతకలిస్తే వారి బలం 41కి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వారికీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 5 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు అవసరం. మొత్తం 10 మంది స్వతంత్రులు ఉన్నారు. దీంతో హరియాణలో స్వతంత్రులే కింగ్ మేకర్లుగా నిలుస్తున్నారు. బీజేపి మరియు కాంగ్రెస్+ ఇరు పక్షాలకు 5 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు చాలు. ఈ నేపథ్యంలో హరియాణ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.



సంబంధిత వార్తలు