Election Results: హర్యానాలో కాంగ్రెస్ జోరు.. జమ్మూకశ్మీర్ లోనూ దూకుడు.. వెలువడుతున్న ఫలితాలు.. నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్ (లైవ్)

ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ఫలితాలు వెలువడుతున్నాయి.

Jammu Kashmir elections, PM Modi - Rahul Gandhi tour updates

Newdelhi, Oct 8: హర్యానా (Haryana), జమ్మూకశ్మీర్ (JammuKashmir) అసెంబ్లీ ఎన్నికల (Assembly Election Results) ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ఫలితాలు వెలువడుతున్నాయి. హర్యానాలో కాంగ్రెస్ జోరు కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టే ఫలితాలు వస్తున్నాయి. హర్యానాలో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో ముందుకు సాగుతుండగా, జమ్మూకశ్మీర్ లోనూ కాంగ్రెస్ దూకుడు కనిపిస్తున్నది. ఈ మేరకు  ఫలితాలు అలాగే వస్తున్నాయి. అక్టోబర్ 5న ఒకే విడతలో పోలింగ్ జరగ్గా, 67.90 శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ, అమరావతి, పోలవరం నిధులుపై చర్చలు, విభజన హామీలు కూడా చర్చకు వచ్చినట్లుగా వార్తలు

Live Video:

అక్కడ అలా.. ఇక్కడ ఇలా

జమ్మూకశ్మీర్ లో మొత్తం 90 సీట్లకు గానూ 873 మంది నేతలు బరిలో నిలిచారు. మూడు విడతల్లో ఎన్నికలు జరగ్గా, 63.45 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 46 కాగా, ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడిన కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ లు తాము సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక హర్యానాలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, ఆప్, ఐఎన్ఎల్ఢీ - బీఎస్పీ, జేజేపీ - అజాద్ సమాజ్ పార్టీలు పోటీ పడ్డాయి. అత్యధిక స్థానాల్లో బీజేపీ- కాంగ్రెస్ మధ్యే నువ్వానేనా అన్నరీతిలో పోటీ జరిగింది. మొత్తం 90 స్థానాలకు గానూ 1031 మంది అభ్యర్ధులు బరిలో నిలవగా, వీరిలో 464 మంది స్వతంత్ర అభ్యర్ధులే ఉండటం విశేషం.

మలుపులు తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు, టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన తీగల కృష్ణారెడ్డి, మ‌న‌వ‌రాలి పెళ్లికి ఏపీ సీఎంను ఆహ్వానించిన ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి