New Parliament Building: నేడు కొత్త పార్లమెంట్‌ భవనంలోకి ఎంపీలు.. గిఫ్ట్ బ్యాగ్ ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. కొత్త పార్లమెంట్ భవనంలోని ఈ ప్రత్యేకతల గురించి తెలుసా? నేటి పార్లమెంట్ షెడ్యూల్ ఏంటంటే??

ఇవి రొటీన్‌కి భిన్నంగా జరగనున్నాయి. ఎందుకంటే.. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఎంపీలంతా కొత్త పార్లమెంట్ భవనంలోకి వెళ్లబోతున్నారు.

Credits: X

Newdelhi, Sep 19: నేడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Session) రెండో రోజు జరగబోతున్నాయి. ఇవి రొటీన్‌కి భిన్నంగా జరగనున్నాయి. ఎందుకంటే.. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సహా ఎంపీలంతా కొత్త పార్లమెంట్ (New Parliament) భవనంలోకి వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలోనే.. కొత్త పార్లమెంట్‌లోని కొన్ని ప్రత్యేకతల గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ఎంపీల ప్రసంగాల కోసం కేటాయించబడిన మైక్రోఫోన్‌ లకు ఒక ప్రత్యేక సిస్టమ్ ఉందని తెలిసింది. ఎంపీలకు ప్రసంగం కోసం కేటాయించిన సమయం ముగిసిన వెంటనే.. వారి మైక్రోఫోన్స్ ఆఫ్ అయ్యేలా ఆటోమెటెడ్ సిస్టమ్ అమర్చినట్టు తెలుస్తోంది. ఈ ఆటోమెటెడ్ సిస్టమ్‌ను తీసుకురావడానికి ఒక ప్రధాన కారణం ఉంది. తమ ప్రసంగాలు పూర్తి కాకముందే.. ప్రభుత్వాలు మైక్రోఫోన్‌లను ఆపేసి, తమ గొంతును నొక్కేస్తుందని ప్రతిపక్ష ఎంపీల నుంచి ఆరోపణలు వచ్చాయి.

Parliament Special Session 2023: ఉభయ సభలు వాయిదా, రేపటి నుంచి కొత్త భవనంలో పార్లమెంట్ సమావేశాలు, నూతన పార్లమెంటులో ఆరు ద్వారాలతో పాటు పలు ప్రత్యేకతలు ఇవిగో..

బయోమెట్రిక్

కేవలం ఇదొక్కటే కాదు. . ఈ కొత్త భవనంలో ఇంకా మరిన్ని ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయని సమాచారం. సాధారణంగా.. కొందరు సభ్యులు తమ ఆవేశం కోల్పోయినప్పుడు వెల్‌లోకి దూసుకొచ్చి, నిరసనలు తెలుపుతుంటారు. అయితే.. కొత్త భవనంలో అందుకు వీలు లేకుండా బాగా కుదించేశారు. బయోమెట్రిక్ వ్యవస్థని సైతం ఏర్పాటు చేశారు. ఈ కొత్త భవనంలో ఇకపై పేపర్‌ లెస్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. అంటే.. ఇకపై పేపర్ల అవసరం లేకుండా ప్రతీ ఎంపీకి ఒక ప్రత్యేకమైన టాబ్లెట్ కంప్యూటర్‌ ని ఇస్తారు. ఈ పార్లమెంట్‌లో మరో ఆకర్షణీయ విషయం ఏమిటంటే.. ఆరు ద్వారాలు. వీటికి గజ, అశ్వ, గరుడ, మకర, శార్దూల, హంస అనే పేర్లు కేటాయించారు. వీటి గుమ్మాలు కూడా చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.

పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానంపై లోక్‌సభలో ప్రధాని మోదీ ఉద్వేగభరిత ప్రసంగం, ఏపీ విభజన నుంచి చంద్రయాన్ 3 మిషన్ దాకా...

 నేటి షెడ్యూల్



సంబంధిత వార్తలు

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

CM Siddaramaiah: అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే, వీడియోని షేర్ చేస్తూ మండిపడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

JPC On Jamili Elections: జమిలీ ఎన్నికలు...31 మందితో జేపీసీ ఏర్పాటు చేసిన కేంద్రం, ప్రియాంక గాంధీ..మనీష్ తివారి సహా కమిటీలో ఉంది వీరే...పూర్తి వివరాలివిగో

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif