IPL Auction 2025 Live

Lok Sabha Elections 2024: కర్ణాటక రాజకీయల్లో అనూహ్య మలుపు, జేడీఎస్‌తో జట్టు కట్టిన బీజేపీ, నాలుగు లోక్‌సభ సీట్లు ఇచ్చేలా ఒప్పందం

2024 ఎన్నికల కోసం జేడీఎస్‌తో(JDS) బీజేపీ అవగాహన కుదుర్చుకుందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప తెలిపారు. కర్ణాటకలోని నాలుగు స్థానాల్లో జేడీఎస్ పోటీ చేస్తుందని వెల్లడించారు.

Narendra Modi-HD Deve Gowda (Photo Credits: ANI)

Bengaluru, Sep 6: 2024 లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్న వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2024 ఎన్నికల కోసం జేడీఎస్‌తో(JDS) బీజేపీ అవగాహన కుదుర్చుకుందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప తెలిపారు. కర్ణాటకలోని నాలుగు స్థానాల్లో జేడీఎస్ పోటీ చేస్తుందని వెల్లడించారు.

మాండ్యా, హసాన్, బెంగళూరు(రూరల్), చిక్‌బల్లాపూర్ సీట్లను జేడీఎస్ కోరుతోందని సంబంధిత వర్గాలు చెప్పాయి. 2019లో ఈ నాలుగు స్థానాల్లో మూడింట బీజేపీ గెలవగా.. కేవలం హసాన్‌లో మాత్రమే జేడీఎస్ గెలిచింది. జేడీఎస్ వ్యవస్థాపకుడు హెచ్‌డీ దేవే గౌడ తుమ్‌కూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక దేవెగౌడ మనువడు, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమారస్వామి మాండ్యా నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

తన తల నరుకుతానన్న ఆచార్య దిష్టి బొమ్మలు దహనం చేయకండి, డీఎంకే కార్యకర్తలకు నాలుగు పేజీల బహిరంగ లేఖ రాసిన ఉదయనిధి స్టాలిన్

కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాల ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ సోలోగా 25 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్‌, జేడీఎస్‌ చోరో సీటు దక్కించుకున్నాయి. అందులో హసన్‌ స్థానం నుంచి దేవగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణ విజయం సాధించాడు. అయితే.. ప్రజ్వల్‌ ఎన్నిక ప్రకక్రియలో అవినీతికి పాల్పడ్డారనే అభియోగాల మేరకు ఆయన ఎన్నికను రద్దు చేస్తూ ఈ మధ్యే కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చెందింది. ఈ నేపథ్యంలో.. లోక్‌సభ స్థానాలను చేజారిపోకుండా ఉండేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు ముందుకు వస్తోంది.

కర్ణాటక తుది ఫలితాలు ఇవే! ఎవరూ అంచనా వేయని స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయదుందుభీ, గత ఎన్నికలతో పోలిస్తే ఎన్ని సీట్లు ఎక్కువ వచ్చాయో తెలుసా?

2019 ఎన్నికల్లో జేడీఎస్ 10 శాతం కంటే తక్కువ ఓటు షేరును పొందింది. ఈ ఏడాదే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జేడీఎస్‌కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 14 శాతం ఓట్లకే పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో బీజేపీతో అవగాహన జేడీఎస్‌కు కీలకమవబోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.జేడీఎస్‌తో అవగాహన బీజేపీకి కూడా చాలా కీలకమవబోతోంది. కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా (I.N.D.I.A) కూటమికి గట్టి కౌంటర్ ఇవ్వాలని బీజేపీ ఇప్పటికే యోచిస్తున్న విషయం తెలిసిందే.

కర్ణాటకలో ఈ ఏడాది మే నెల వరకు బీజేపీ అధికారంలోనే ఉంది. అయితే 224 సీట్లలో ఏకంగా 135 సీట్లలో విజయం సాధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ సీట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని బీజేపీ భావిస్తోంది. ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకూడదని భావిస్తోంది. అందులో భాగంగానే జేడీఎస్‌తో అవగాహన కుదుర్చుకుందనే టాక్ వినిపిస్తోంది.