Bangalore, May 13: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Election Results) కాంగ్రెస్ పార్టీ 136 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ (BJP) 65 సీట్లకే పరిమితం అయింది. జేడీఎస్ (JDS) 19 సీట్లు, కల్యాణ రాజ్య ప్రగతి పక్షం పార్టీ, సర్వోదయ కర్ణాటక పక్షం పార్టీ ఒక్కో సీటు చొప్పున గెలుచుకున్నాయి. అలాగే, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 113 స్థానాలు గెలుచుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. కాంగ్రెస్ కి (Congress) అంతకంటే 23 సీట్లు ఎక్కువ వచ్చాయి. దీంతో కాంగ్రెస్ జేడీఎస్ మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఎన్నికల్లో గెలవడంతో బెంగళూరులో ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి (karnataka CM Candidate) ఎన్నికపై కొత్త ఎమ్మెల్యేలు చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నందిని బ్రాండ్ స్వీట్లను తమ నేతలకు పంచారు. కర్ణాటక ఎన్నికల్లో అమూల్ Vs నందిని బ్రాండ్ల విషయంలో మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే.
#WATCH | Congress national president Mallikarjun Kharge distributes 'Nandini' brand sweets to party leaders as the party celebrates its victory in the #KarnatakaPolls pic.twitter.com/DkQaPuL22q
— ANI (@ANI) May 13, 2023
కొత్త ముఖ్యమంత్రి ఈ నెల 15న ప్రమాణం స్వీకారం చేయనున్నట్లు తెలుస్తున్నది. కంఠీరవ స్టేడియంలో సీఎం ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తున్నది. అయితే, ఎవరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొన్నది. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో పాటు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivkumar) రేసులో ఉన్నారు. ఈ క్రమంలో ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారన్నది ఆదివారం ఖరారుకానున్నది.
Congress have 137 legislators as our ally Darshan Puttannaiah won from Melukote seat. I've been told that Puttaswamy Gowda, an independent candidate, has also extended his support to Congress party. So now we have 138, says Randeep Singh Surjewala pic.twitter.com/EAn6O12bb0
— ANI (@ANI) May 13, 2023
కర్ణాటకలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకీ మెజార్టీ ఇవ్వలేదు. గత ఎన్నికల్లో బీజేపీ 104, కాంగ్రెస్ 80, జేడీఎస్ 37 సీట్లు గెలుచుకుున్నాయి. ఇక స్వతంత్ర అభ్యర్థి, బీజేఎస్పీ, కేపీజేపీకి ఒక్కో సీటు దక్కాయి. ఆ ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. చివరకు జేడీఎస్ నేత కుమారస్వామికి సీఎం పదవిని అప్పజెప్పుతూ జేడీఎస్ తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండేళ్ల తర్వాత ఆ ప్రభుత్వం కుప్పకూలి బీజేపీ సర్కారు ఏర్పడింది.