Lok Sabha Elections 2024 Dates: రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, ప్రస్తుత లోక్‌సభకు జూన్ 16వ తేదీతో ముగియనున్న గడువు
రేపు.. శనివారం(16 మార్చి) మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని.. ఈ మేరకు ప్రెస్‌మీట్ ఉంటుందని ఈసీఐ ప్రతినిధి ట్వీట్ ద్వారా తెలియజేశారు.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా స్పందించింది. రేపు.. శనివారం(16 మార్చి) మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని.. ఈ మేరకు ప్రెస్‌మీట్ ఉంటుందని ఈసీఐ ప్రతినిధి ట్వీట్ ద్వారా తెలియజేశారు.
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ 2వ తేదీతో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో, ఒడిషా అసెంబ్లీ గడువు జూన్ 24వ తేదీతో ముగియనున్నాయి.ప్రస్తుత లోక్‌సభకు జూన్ 16వ తేదీతో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (AP Assembly Elections) సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పోలింగ్ తేదీలను ప్రకటించనున్నారు. ఎన్నికల బాండ్లపై పూర్తి డేటా ఇవ్వని ఎస్‌బీఐ, ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, ఈ నెల 18లోగా సమాధానం చెప్పాలని ఆదేశాలు, ఎన్నికల బాండ్లు ఏ పార్టీకి ఎన్ని అందాయంటే..
గత లోక్‌సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్‌ను ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఓట్ల లెక్కంపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్-మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది.
Here's EC Tweet
శుక్రవారం ఉదయం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ సమక్షంలో జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్ బీర్ సింగ్ సంధు ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం కీలక భేటీ జరిగింది. ఈ భేటీలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తేదీపై నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.