Lok Sabha Elections Results 2024: 543 ఎంపీ సీట్లలో 240 మాత్రమే గెలుచుకున్న బీజేపీ, 99 సీట్లతో పుంజుకున్న కాంగ్రెస్, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..
దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన రాష్ట్రంలో బీజేపీ భారీగా సీట్లు కోల్పోయింది. యూపీలోని మొత్తం 80 నియోజకవర్గాలకు గానూ బీజేపీ 2014లో 71 స్థానాలను, 2019లో 62 స్థానాలను గెలుచుకున్నది.
కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకు ఫలితాలను ప్రకటించింది, ఇందులో బీజేపీ 240 సీట్లు, కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకున్నాయి. మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గం ఎన్‌సీపీ (శరద్ పవార్) ఫలితాల్లో చివరిగా వెలువడింది. అభ్యర్థి బజరంగ్ మనోహర్ సోన్వానే 6,553 ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన పంకజా ముండేపై విజయం సాధించారు.లోక్‌సభలో 543 మంది సభ్యులున్నారు. అయితే, బీజేపీ సూరత్ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకపక్షంగా ఎన్నికైన తర్వాత 542 స్థానాలకు ఓట్లను లెక్కించారు. భారత్ లో ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై అమెరికా రియాక్షన్, గెలుపోటములతో మాకు సంబంధం లేదన్న వైట్ హౌజ్
బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్ ప్రజలు ఈసారి ఆ పార్టీకి చేదు ఫలితాలను మిగిల్చారు. దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన రాష్ట్రంలో బీజేపీ భారీగా సీట్లు కోల్పోయింది. యూపీలోని మొత్తం 80 నియోజకవర్గాలకు గానూ బీజేపీ 2014లో 71 స్థానాలను, 2019లో 62 స్థానాలను గెలుచుకున్నది. ఈ ఎన్నికల్లో మాత్రం బీజేపీ 74 స్థానాల్లో పోటీ చేసి 33 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది.అయోధ్య రామమందిర నిర్మాణం బీజేపీకి రాజకీయంగా లాభం చేకూర్చలేదు. ఆ పార్టీ గొప్పగా చెప్పుకున్న యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ పాలసీ బెడిసికొట్టింది.
ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పార్టీలు గెలుచుకున్న సీట్ల సంఖ్య క్రింది విధంగా ఉంది
బీజేపీ - 240
కాంగ్రెస్ - 99
సమాజ్‌వాదీ పార్టీ - 37
తృణమూల్ కాంగ్రెస్ - 29
డీఎంకే - 22
Telugu Desam Party - 16
JD(U) - 12
శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) - 9
NCP (శరద్ పవార్) - 8
శివసేన - 7
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) - 5
YSRCP - 4
RJD - 4
సీపీఐ(ఎం) - 4
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ - 3
AAP-3
జార్ఖండ్ ముక్తి మోర్చా - 3
జనసేన పార్టీ - 2
CPI (ML) (లిబరేషన్) - 2
JD(S) - 2
విదుతలై చిరుతైగల్ కట్చి - 2
సిపిఐ - 2
రాష్ట్రీయ లోక్ దళ్ - 2
నేషనల్ కాన్ఫరెన్స్ - 2
యునైటెడ్ పీపుల్స్ పార్టీ, లిబరల్ - 1
అసోం గణ పరిషత్ - 1
హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) - 1
కేరళ కాంగ్రెస్ - 1
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ - 1
NCP - 1
వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ - 1
జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ - 1
శిరోమణి అకాలీదళ్ - 1
రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ - 1
భారత్ ఆదివాసీ పార్టీ - 1
సిక్కిం విప్లవ మోర్చా - 1
మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగం - 1
ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) - 1
అప్నా దల్ (సోనీలాల్) - 1
AJSU పార్టీ - 1
AIMIM -1
స్వతంత్రులు - 7