Maharashtra Political Crisis: సీఎం ఉద్ధవ్ రాజీనామాతో బల పరీక్ష రద్దు, గ‌వ‌ర్న‌ర్ ఆదేశాల ప్ర‌కారం జ‌ర‌గాల్సిన బ‌ల‌ప‌రీక్ష‌ను ర‌ద్దు చేసిన‌ట్లు ఎమ్మెల్యేల‌కు తెలిపిన అసెంబ్లీ సెక్ర‌ట‌రీ

ఇవాళ మ‌హారాష్ట్ర అసెంబ్లీలో జ‌ర‌గాల్సిన బ‌ల‌ప‌రీక్ష‌ను ర‌ద్దు చేశారు. అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశాన్ని కూడా వాయిదా వేశారు.

Uddhav and padnavis (Photo-ANI)

మహారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో.. ఇవాళ మ‌హారాష్ట్ర అసెంబ్లీలో జ‌ర‌గాల్సిన బ‌ల‌ప‌రీక్ష‌ను ర‌ద్దు చేశారు. అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశాన్ని కూడా వాయిదా వేశారు. అసెంబ్లీ సెక్ర‌ట‌రీ రాజేంద్ర భ‌గ‌వ‌త్ దీనిపై ఓ ప్ర‌క‌ట‌న చేశారు. గ‌వ‌ర్న‌ర్ ఆదేశాల ప్ర‌కారం జ‌ర‌గాల్సిన బ‌ల‌ప‌రీక్ష‌ను ర‌ద్దు చేసిన‌ట్లు ఎమ్మెల్యేల‌కు ఆయ‌న తెలిపారు. వాస్త‌వానికి ఇవాళ సాయంత్రం లోగా ఉద్ధ‌వ్ త‌న బ‌లాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. కానీ బుధ‌వారం ఆయ‌న రాజీనామా చేయ‌డంతో సీన్ రివ‌ర్స్ అయ్యింది. బ‌ల‌ప‌రీక్ష ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ శివ‌సేన సుప్రీంను ఆశ్ర‌యించ‌గా.. కోర్టు ఆ పిటిష‌న్‌ను తిర‌స్క‌రించిన విష‌యం తెలిసిందే. తాజాగా  సీఎం ఉద్ధ‌వ్ రాజీనామాను గ‌వ‌ర్న‌ర్ కోశియారి ఆమోదించారు.