Maharashtra Political Drama: బలం నిరూపించుకోమంటే బీజేపీ పారిపోతోంది, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఎవరిబలమేంటో తేల్చుకుందామని బీజేపీకి చురకలంటించిన కాంగ్రెస్ సీనియర్ నేత
అధికార, ప్రతిపక్ష పార్టీలు కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నాయి.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ (Congress) సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పై మరింతగా తన దూకుడును పెంచింది. మహారాష్ట్ర అసెంబ్లీలో బలం నిరూపించాల్సిందిగా బీజేపీని కోరితే ఆ పార్టీ పారిపోతోందని ( BJP is "running away)కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది.
Mumbai, November 25: మహాలో పొలిటికల్ వార్ మరింతగా ముదిరింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నాయి.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ (Congress) సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పై మరింతగా తన దూకుడును పెంచింది. మహారాష్ట్ర అసెంబ్లీలో బలం నిరూపించాల్సిందిగా బీజేపీని కోరితే ఆ పార్టీ పారిపోతోందని ( BJP is "running away)కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. తగినంత సంఖ్యా బలం లేకపోవడం వల్లే బీజేపీ వెనకడుగు వేస్తోందని మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ (Congress leader and former state chief minister Prithviraj Chavan) శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో చెప్పారు.
సంఖ్యాబలం లేని బీజేపీ (BJP) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం అక్రమమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా (Congress's chief spokesperson Randeep Surjewala)అన్నారు. సంఖ్యాబల నిరూపణకు వెళదామని, అక్కడే ఎవరి బలమేమిటో తేలిపోతుందని బీజేపీకి చురకలంటించారు. బలనిరూపణకు వెళ్తే తమ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. గవర్నర్ కార్యాలయాన్ని ఉపయోగించుకొని బీజేపీ అక్రమ చర్యలకు దిగిందని ఆరోపించారు.
ఇదిలా ఉంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో ఆదివారం రాత్రి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సమావేశమయ్యారు. కొద్దిసేపు ఇద్దరు నేతలు రహస్య చర్చలు జరిపారు. వీరిద్దరూ బల నిరూపణకు తీసుకోవలసిన చర్యలతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. అయితే రైతాంగ సంక్షోభంపై వారిద్దరు చర్చించారని సీఎంఓ ట్వీట్ చేసింది.